Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేసిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత అనంతరం ఆ ప్రాంతంలో అధికారులు శిథిలాలు తొలగింపు ప్రక్రియను చేపడుతున్నారు. సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన ఆ టవర్స్ ను సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేసిన విషయం తెలిసిందే. 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కూలిపోవడంతో భారీగా శిథిలాలు ఉన్నాయి. 40 అంతస్తుల ఆ భవనాలు కూలిపోయాక వాటి శిథిలాలు తొలగించే ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది.

Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేసిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన అధికారులు

Noida Twin Towers

Noida Twin Towers: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత అనంతరం ఆ ప్రాంతంలో అధికారులు శిథిలాలు తొలగింపు ప్రక్రియను చేపడుతున్నారు. సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన ఆ టవర్స్ ను సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేసిన విషయం తెలిసిందే. 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కూలిపోవడంతో భారీగా శిథిలాలు ఉన్నాయి. 40 అంతస్తుల ఆ భవనాలు కూలిపోయాక వాటి శిథిలాలు తొలగించే ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది.

దీనిపై నోయిడా అథారిటీ సీఈవో రీతూ మహేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వాటిని తొలగించే ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతోందని చెప్పారు. తమ సిబ్బంది నీళ్ళు, పలు పరికరాలతో ఆ పరిసర ప్రాంతాలను, రోడ్లను శుభ్రం చేస్తున్నారని అన్నారు. అక్కడి చెట్లపై కూడా నీళ్ళు పోస్తున్నట్లు తెలిపారు. కూల్చివేత కారణంగా సమీపంలో భారీగా దుమ్ము చేరినట్లు వివరించారు. విద్యుత్తు, వంట గ్యాసు సరఫరాల వంటివి కూడా అందుతున్నట్లు చెప్పారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు ఇంకా ఉందని తెలిపారు. భవనాల కూల్చివేత నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఇళ్ళ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగి తమ ఇళ్ళకు చేరుకోవడానికి గత రాత్రి 7 గంటల నుంచి అధికారులు అనుమతి ఇచ్చారు. చాలా మంది నిన్న రాత్రే తమ ఇళ్ళకు వెళ్ళారు. కొందరు ఇవాళ ఉదయం తిరిగి వెళ్ళారు. దాదాపు 5,000 మంది ఆ ట్విన్ టవర్స్ కు సమీపంలో ఉంటారు.
India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు