India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా కాలం తర్వాత కొత్త కేసులు 8 వేల దిగువకు వచ్చాయి. దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 84,931గా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉందని చెప్పింది.

India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు

India Covid-19 cases

India Covid-19 cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా కాలం తర్వాత కొత్త కేసులు 8 వేల దిగువకు వచ్చాయి. దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 84,931గా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉందని చెప్పింది.

వారాంతపు పాజిటివిటీ రేటు 2.69 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,38,02,993 ఉందని చెప్పింది. ఇప్పటివరకు మొత్తం 88.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారని వివరించింది. నిన్న దేశంలో 1,65,751 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు 211.91 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.19 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసులు 15.43 కోట్లు ఉన్నాయని చెప్పింది. నిన్న దేశంలో 24,70,330 డోసుల వ్యాక్సిన్లు వేశామని పేర్కొంది.

Karnataka school Book: ‘జైలులో సావర్కర్ వద్దకు పక్షులు వచ్చేవి.. వాటి రెక్కలపై ఆయన ఎగిరి వెళ్ళేవారు’ అంటూ బడిలో పాఠాలు