Anand Mahindra Representative Image (Image Credit To Original Source)
Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదర్శప్రాయమైనవి, జనాల్లో స్ఫూర్తిని నింపే కంటెంట్ ఏది కనిపించినా.. వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 10 మందికి ఉపయోగడేలా, ఇన్ స్పైర్ చేసేలా ఆయన సోషల్ మీడియా పోస్టులు ఉంటాయి. తాజాగా ఆయన షేర్ చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వారాన్ని ఫిట్‌నెస్ స్ఫూర్తితో ప్రారంభించారు మహీంద్రా. అది ఆన్‌లైన్‌లో త్వరగా దృష్టిని ఆకర్షించింది. #MondayMotivation హ్యాష్‌ట్యాగ్ తో ఒక శక్తివంతమైన జిమ్ వీడియోను ఆయన పంచుకున్నారు. హల్క్ లాంటి శరీరాకృతి కలిగిన ‘సీనియర్ సిటిజన్’ అంటూ ఓ వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తారు. 60 ప్లస్ ఏజ్ లోనూ కండలు తిరిగిన శరీరం చూసి మెస్మరైజ్ అయిపోయారు మహీంద్రా. ఈ ఏజ్ లోనూ ఈ రేంజ్ లో ఫిట్ నెస్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఆ పెద్దాయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఆయనొక వృద్ధుడు. 60 ప్లస్ ఏజ్ ఉండొచ్చు. అయితేనేం.. కుర్రాళ్లను తలదన్నేలా ఆయన బాడీ ఉంది. కండలు తిరిగిన శరీరం ఆయన సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే హల్క్ లాంటి శరీరాకృతిని కలిగున్నారు. ఇక ఆత్మవిశ్వాసంతో భారీ బరువులను సైతం అవలీలగా ఎత్తడం చూస్తే వావ్ అనాల్సిందే. ఆ వృద్ధుడి అసాధారణ ఫిట్‌నెస్ స్థాయిని ప్రశంసలతో ముంచెత్తారు మహీంద్రా.
“స్టెరాయిడ్స్ వాడకుండా మీలో ఎవరైనా ఇలాంటి దేహాన్ని సాధించగలరా? ఈ వయసులో ఆయన చేస్తున్న సాధన అమోఘం. నేను నా వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం చేసే ప్రతిసారీ ఆ పెద్దాయన వైఖరి నాకు ప్రేరణ ఇస్తుంది” అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. ”ఈ ఏజ్ లో అలాంటి బాడీని మెయింటైన్ చేయడం నిజంగా గ్రేట్. ఆయన క్రమశిక్షణకు ఇది అద్దం పడుతుంది. మీ అలవాట్లు బలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఈయనను చూస్తే వయసు ఒక సంఖ్య మాత్రమే” అని పెద్దాయన ప్రూవ్ చేశారు.
”స్టెరాయిడ్ల సంగతి పక్కన పెట్టండి. ఆ వయసులో ఈ స్థాయి శక్తి, ఉత్సాహాన్ని కొనసాగించడమే నిజమైన ప్రేరణ. షార్ట్‌కట్స్ కంటే దీర్ఘకాలిక క్రమశిక్షణ చాలా ముఖ్యం అని చెప్పేందుకు ఈ పెద్దాయనే నిదర్శనం. అంకితభావంతో శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పేందుకు ఈయన నిలువెత్తు నిదర్శనం” అని నెటిజన్లు కామెంట్ చేశారు.
“చాలా మంది 30 ఏళ్ల వయసులో సాకులు చెబుతారు. ఈ వ్యక్తి 60 ప్లస్ వయసులోనూ బరువులు ఎత్తుతున్నాడు. మమ్మల్ని ఆపేది ఏమిటి?” ”ఈ పోస్ట్‌లో ఉత్తమ భాగం మనస్తత్వంపై దృష్టి పెట్టడం. బలం మనసులోనే ప్రారంభమవుతుంది”. “ఒక మేలుకొలుపు కాల్”, “స్థిరత్వం వయసును అధిగమిస్తుందని రుజువు చేశారు” “మనకు నిజంగా అవసరమైన సోమవారం ప్రేరణ” అని నెజటిన్లు తమ స్పందన తెలియజేశారు. ”క్రమశిక్షణ, తగినంత నిద్ర, పోషకాహారం, దశాబ్దాల తెలివైన జీవన విధానం. అదే నిజమైన పరివర్తన” అని మరో నెటిజన్ స్పందించాడు.
He makes the description: ‘Senior Citizen’ seem way out of place.
Can you maintain this bulk without steroids? Don’t know.
But it’s his attitude that’s going to be my motivation every time I do my weight training workout… 🙂#MondayMotivation
— anand mahindra (@anandmahindra) February 16, 2026
Also Read: డాలర్లతో పనిలేదు.. ఫారెన్ గెస్టులకు ఇండియాలో పేమెంట్స్ ఈజీ.. UPI స్కాన్ చేస్తే చాలు.. ఎలా వాడాలంటే?