Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో నవ్వులు పూయించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధిరామయ్య పరుగు.. వీడియో వైరల్
రత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధిరామయ్య యాత్రలో పాల్గొనగా రాహుల్ గాంధీ ఆయన చేయి పట్టుకొని పరుగెత్తారు. దీంతో రాహుల్ వెంట పరుగెత్తేందుకు సిద్ధిరామయ్య ఆపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Harish Thanniru
- Updated on- October 7, 2022 / 07:11 AM IST
Bharath jodo yatra
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా సాగుతుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముగించుకొని కర్ణాటకలో సాగుతున్న పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. సెప్టెంబర్ 30న రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 21వరకు కొనసాగనుంది. గురువారం మాండ్యా జిల్లాలో కొనసాగిన యాత్రలో రాహుల్ గాంధీ తల్లి, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె యాత్రలో పాల్గొన్నారు.
Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.. ఫొటో గ్యాలరీ
గురువారం భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధిరామయ్య యాత్రలో పాల్గొనగా రాహుల్ గాంధీ ఆయన చేయి పట్టుకొని పరుగెత్తారు. దీంతో రాహుల్ వెంట పరుగెత్తేందుకు సిద్ధిరామయ్య ఆపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
భారత్ జోడో పాదయాత్రలో భాగంగా రాహుల్ వెంట సిద్ధిరామయ్య నడుస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ కొద్దిదూరం పరుగెత్తేందుకు సిద్ధమయ్యాడు. పక్కనే ఉన్న సిద్ధిరామయ్యకూడా మీతో పరుగెత్తుతాడంటూ మరో కాంగ్రెస్ నేత సూచించడంతో రాహుల్ గాంధీ సిద్ధిరామయ్య చేయి పట్టుకొని పరుగెత్తడం మొదలు పెట్టారు. అలా నిమిషం పాటు రాహుల్ సిద్ధిరామయ్యతో కలిసి పాదయాత్రలో పరుగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರ ಆರೋಗ್ಯದ ಗುಟ್ಟು
ಅವರ ಆರೋಗ್ಯಕರ ಮನಸ್ಸು.@RahulGandhi ಜೊತೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುತ್ತಾ ನಾನೂ ಯುವಕನಾದೆ.ಭರವಸೆಯ ಕೈಗಳು ಹೀಗೆಯೇ
ಕೈ ಹಿಡಿದರೆ ದಾರಿ ಎಷ್ಟೇ ದುರ್ಗಮವಾಗಿದ್ದರೂ
ಗುರಿ ಮುಟ್ಟುವುದು ಖಚಿತ.ನಮ್ಮ ನಾಯಕ
ನಮ್ಮ ಹೆಮ್ಮೆ.#BharatJodoYatra pic.twitter.com/HH1n2WWZlK— Siddaramaiah (@siddaramaiah) October 6, 2022
