Rahul Gandhi : సర్ వివాదం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌‌ టార్గెట్‌గా రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్..! ప్రశ్నల వర్షం..

Rahul Gandhi : ప్రజల ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఓటింగ్ వ్యవస్థను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Rahul Gandhi

Rahul Gandhi : ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఓట్ల చోరీ, చట్టం చోరీ, వ్యవస్థ చోరీ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read : Lizard Found in Food : స్కూల్‌లో షాకింగ్ ఘటన.. పిల్లలకు పెట్టిన టిఫిన్‌లో బల్లి.. ఆస్పత్రిలో విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు..

ఎన్నికల ప్రక్రియపై తనకు తీవ్ర సందేహాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్‌లో జరిగిన ఎన్నికలన్నీ రిగ్గింగ్ అయ్యాయని తాను 100శాతం నమ్మకంతో చెబుతున్నానని అన్నారు. ఎన్డీయే హయాంలో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పటికే ప్రజల ఓటు హక్కును కాలరాశారు. ఇప్పుడు చట్టాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఓటింగ్ వ్యవస్థను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలి. ఓటు చోరీ గురించి ఈసీలకు ముందే తెలుసు.. అన్ని ఎన్నికలు రిగ్గింగ్‌కు గురయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వాలపై సాధారణంగా కనిపించే ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ప్రభావం చూపడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు.

మరోవైపు.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.