New Governors : ఒకేసారి ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. పూర్తి జాబితా ఇదే! తెలుగు రాష్ట్రాల నుంచి ఇక ఇద్దరే..
New Governors : దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
- Harish Thanniru
- Published on- October 13, 2026 / 12:36 PM IST
New Governors
New Governors : దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. సిక్కిం, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు తమ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
Also Read : Jio Bp Petrol Price Hike : వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపు!
సిక్కిం కొత్త గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్, కేరళ గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథూర్, తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు. అలాగే కర్ణాటక గవర్నర్‌గా డాక్టర్ సుధాయాదవ్, ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసేన్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో భాగంగా నాలుగు రాష్ట్రాలకు కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించగా, మరో రెండు రాష్ట్రాలకు గవర్నర్లను బదిలీ చేశారు. కొత్తగా నియమించిన నలుగురు గవర్నర్లలో ఇద్దరు దళితులు, ఒక మహిళ, ఒక బీసీ నేతకి అవకాశం కల్పించారు.
మరోవైపు.. కొత్త నియామకాలతో ప్రస్తుతం ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ గవర్నర్లుగా సేవలందిస్తున్న కంభంపాటి హరిబాబు, థావర్‌చంద్ గహ్లోత్, గుర్మిత్ సింగ్‌ల పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం ఉన్న ముగ్గురు తెలుగు గవర్నర్లలో ఒడిశాకు సేవలందిస్తున్న కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగిసినట్లయింది. ఇక గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, త్రిపుర గవర్నర్ గా ఎన్. ఇంద్రసేనారెడ్డిలు మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లుగా కొనసాగుతున్నారు.
