Encounter : అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం
సరిహద్దుల్లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
- kunduru Vinod
- Updated on- December 30, 2021 / 07:11 AM IST
Encounter
Encounter : సరిహద్దుల్లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పోలీసు గాయపడ్డారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడ కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు.
చదవండి : Encounter : కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఆ ప్రాంతంలో బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా, దాక్కున్న ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరపడంతో బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు చేశాయని జమ్మూకశ్మీర్ ఐజీపీ తెలిపారు. వేర్వేరు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్తాన్‌కి చెందినవారు కాగా, మరో ఇద్దరు స్థానికులని, మిగతా ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులని అధికారులు తెలిపారు.
చదవండి : Encounter : అనంత్‌నాగ్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
