Gold Price : తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,272కు చేరింది.
- bheemraj
- Published On : August 31, 2021 / 08:16 PM IST
Gold Silver
gold and silver prices : బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,272కు చేరింది.
క్రితం ట్రేడ్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,372 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ కాస్త బలపడటమే ఇవాళ దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.134 తగ్గి రూ.62,639కి చేరింది. క్రితం ట్రేడ్ లో కిలో వెండి ధర రూ.62,773 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్ లో ఇవాళ రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి రూ.73 వద్ద ముగిసింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,815 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 24.16 అమెరికన్ డాలర్లు పలికింది.
