Mad Sandhu Murder: పంజాబ్‌లో ఘోర ఘటన.. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు హత్య.. నడిరోడ్డుపై కాల్చి

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు(Mad Sandhu Murder) పంజాబ్‌‌లోని అమృత్‌సర్‌లో శనివారం దారుణంగా హత్యకు గురయ్యారు.

Social media influencer and makeup artist Mad Sandhu shot dead in Amritsar.

Mad Sandhu Murder: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు (Mad Sandhu Murder)పంజాబ్‌‌లోని అమృత్‌సర్‌లో శనివారం దారుణంగా హత్యకు గురయ్యారు. నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Telangana Rice Millers: తెలంగాణ రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం.. ఆస్తుల జప్తుకు ఆదేశాలు.. సర్కార్ సీరియస్ వార్నింగ్

పోలీసుల దర్యాప్తు, ట్రోలింగ్ కోణంపై ఆరా:

ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు, దానికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, ఇతర కీలక వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. మ్యాడ్ సంధు గతంలో మేకప్, సినిమా రంగం, జెండర్ అంశాలపై పాడ్‌కాస్ట్‌లలో తరచూ మాట్లాడేవారు. అయితే సోషల్ మీడియాలో ఆయన తరచూ హోమోఫోబిక్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనేవారని, ఈ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు.