Uttar Pradesh: న్యూఇయర్ వేళ యూపీలోని ఓ హోటల్లో దారుణం.. ఐదుగురు మహిళలు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు ..

Uttar Pradesh

UP Police : న్యూఇయర్ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఐదుగురిని హత్యచేసింది వారి కుటుంబ సభ్యుడేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన లక్నోలోని శరంజీత్ హోటల్ లో చోటు చేసుకుంది. వీరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు.. నిందితుడు అర్షద్ ను అరెస్టు చేశారు. అయితే, మృతుల్లో నిందితుడి తల్లి, అతని నలుగురు సోదరీమణులు ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగానే అర్షద్ తన తల్లి, నలుగురు సోదరీమణులను హత్యచేసినట్లు తేలిసింది.

Also Read: AP Govt: కేక్ కటింగ్ వద్దు.. అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దు : ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్షద్ మంగళవారం రాత్రి తన కుటుంబంతో సహా ఆగ్రా నుండి లక్నోకు వెళ్లాడు. అక్కడ శరంజీత్ హోటల్ లో ఓ గదిని తీసుకొని వారంతా అక్కడే ఉన్నారు. అయితే, హోటల్ గదిలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో అర్షద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఆగ్రాలోని ఇస్లాం నగర్ కుబేర్ పూర్, తేడి బాగియాలో నివాసం ఉంటున్నారు. మృతుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఆలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)తో సహా నిందితుడి తల్లి అస్మా ఉన్నారు.

Also Read: Hydra Demolitions In Khajaguda : మళ్లీ కూల్చివేతలు షురూ..! ఇయర్ ఎండింగ్ రోజున కూల్చివేతలతో హడలెత్తించిన హైడ్రా..!

నిందితుడు అర్షద్ (24) తన కుటుంబ సభ్యులను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని పంపించి ఆధారాలు సేకరించామని, సమగ్ర విచారణ చేపట్టిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, హోటల్ గదిలోకి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగిందా.. అంతకుముందే వీరి మధ్య విబేధాలు ఉన్నాయా.. ఎందుకోసం హత్య చేశాడు.. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.