Sonam Wangchuk : రాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. క్లారిటీ ఇచ్చిన వాంగ్‌చుక్‌… విమర్శకులకు ఘాటుగా సమాధానం.. అసలు అది సమస్యే కాదంటూ..

Sonam Wangchuk : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రస్తావన చేయకుండా సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై తాజాగా.. వాంగ్ చుక్ స్పందించారు.

Sonam Wangchuk

  • దీక్ష విరమణపై వాంగ్‌చుక్‌ వివరణ
  • కేంద్ర మంత్రి రాజీనామానే ముఖ్యం కాదు..
  • నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే నాకు ముఖ్యం

Sonam Wangchuk : నీటి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో కొనసాగుతున్న ఉద్యమంలో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజులు చేసిన నిరాహార దీక్షను ఇటీవల విరమించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలోనూ వాంగ్‌చుక్ దీక్ష కొనసాగించారు. దీక్ష విరమించేందుకు పలు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. వాటిలో ప్రధానమైంది.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం.

Also Read : PM Modi Video : సోషల్ మీడియాలో ప్రధాని మోదీ పవర్.. ఒక్క వీడియోతో వరల్డ్ రికార్డు..

అయితే, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా తదితరులు వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్ష విరమింపజేశారు. దీంతో వాంగ్ చుక్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి రాజీనామా చేయకుండానే దీక్ష ఎలా విరమించారంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.. అంతేకాదు.? డీల్ కుదిరిందంటూ ఆయనపై పలువురు విమర్శలు గుప్పించారు. వీటిపై తాజాగా సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

నేను చేసిన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించుకునేందుకు సర్టిఫికెట్ కావాలా? అంటూ ప్రశ్నించిన సోనమ్ వాంగ్‌చుక్.. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కేంద్ర మంత్రుల సమక్షంలోనే ఎందుకు దీక్ష విరమించారు..? ఏం ఒప్పందం జరిగింది..? అని చాలా మంది అడుగుతున్నారు. నేను నిరాహార దీక్ష ఎంత పవిత్రంగా చేశానో ఎవరి నుంచైనా సర్టిఫికెట్ తీసుకోవాలా? ఇలా బేరాలు కుదుర్చుకోవాల్సి వస్తే.. ఎవరైనా 26రోజులు ఆకలితో ఉంటారా..? ఏసీ గదిలో కూర్చొని డీల్ చేసుకోలేనా? అంటూ వాంగ్‌చుక్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించకుండానే మీరు దీక్ష ఎందుకు విరమించారని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కచ్చితంగా ముఖ్యమైన విషయమే. కానీ, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే నాకు ప్రాధాన్య అంశంగా అనిపించిందని వాంగ్‌చుక్ చెప్పారు. అందుకే కేంద్రంతో చర్చలు జరుపుతున్న సమయంలో నేను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి ప్రస్తావించలేదని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.

ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాజీనామా విషయంలో ఎటూ తేల్చకుండా కేంద్రం ఎక్కువ కాలం నాన్చలేదు. కొన్నిరోజుల్లో మంత్రి రాజీనామా సమర్పిస్తారని నాకు తెలుసు. అందుకే ఆ విషయంపై నేను మరీ ఎక్కువ ఒత్తి చేయలేదని వాంగ్‌చుక్ వివరించారు.