Gitanjali Angmo: విద్యార్థుల ఉద్యమంతో రాజకీయాలా? మీ నాటకాలు ఆపండి.. రాహుల్ గాంధీపై వాంగ్‌చుక్ భార్య ఆగ్రహం
సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో(Gitanjali Angmo) రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- V Santhosh Kumar
- Published on- July 23, 2026 / 03:36 PM IST
Sonam Wangchuk wife Gitanjali Angmo fires on Rahul Gandhi
- రాహుల్‌పై గీతాంజలి తీవ్ర ఆగ్రహం
- విద్యార్థుల ఉద్యమంతో రాజకీయాలు వద్దు
- నిరసనల్లో నిజాయితీ లేదంటూ విమర్శలు
Gitanjali Angmo: లడఖ్ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో(Gitanjali Angmo) కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, పౌరులు చేస్తున్న పోరాటాలను రాజకీయ నాయకులు తమ సొంత లబ్ధి కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఎలాంటి నిజాయితీ లేదని, అది కేవలం డ్రామా అని ఆమె దుయ్యబట్టారు.
Nethanna Bharosa Scheme: ఏపీలో నేతన్నకు భరోసా రూ.25000.. డేట్ ఫిక్స్.. డబ్బులు పడేది ఆ రోజే
ప్రధాని ఇంటి ముందేల? జంతర్ మంతర్‌కు రండి:
ఇటీవల జరిగిన నిరసనల అనంతరం కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై గీతాంజలి స్పందిస్తూ.. రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న దీక్షలో పాల్గొనాలని సవాల్ విసిరారు. ప్రత్యేకంగా నిరసనలు చేపడుతూ డ్రామాలు ఆడటం సరికాదని, ప్రతిపక్షాల చర్యలు అత్యంత కృత్రిమంగా ఉన్నాయని విమర్శించారు.
మేల్కొన్న భారత్: స్వార్థ రాజకీయాలను సహించదు:
సోనమ్ వాంగ్‌చుక్ సాధించిన గుర్తింపును, విద్యార్థుల ఉద్యమాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని గీతాంజలి హెచ్చరించారు. “ఇండియా ఇప్పుడు మేల్కొంది, ప్రజలను ఎవరూ మోసం చేయలేరు” అని స్పష్టం చేశారు. నిజాయితీ లేని నాయకులను నేటి యువత కచ్చితంగా తోసిపుచ్చుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నిరసనకు స్పందన వచ్చినప్పటికీ, గీతాంజలి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
