Sonia Gandhi Autobiography : సోనియా బుక్ వివాదం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల వార్.. ఇంతకీ ఆత్మకథలో ఏముంది?
Sonia Gandhi Autobiography : పుస్తకాలపై రాజకీయ రచ్చ ఈనాటిది కాదు పైగా పొలిటికల్ అగ్రనేతల జీవిత చరిత్రలు ఆత్మకథలు అనగానే ఎన్నో ఆరోపణలు మరెన్నో అపవాదులు ఇంకెన్నో అనుమానాలు ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ పేరుతో తెరపైకి వచ్చిన ‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విషయంలోనూ ఇదే జరుగుతోంది.
- Harish Thanniru
- Updated on- August 30, 2026 / 08:37 AM IST
Sonia Gandhi Autobiography
Sonia Gandhi Autobiography : పుస్తకాలపై రాజకీయ రచ్చ ఈనాటిది కాదు పైగా పొలిటికల్ అగ్రనేతల జీవిత చరిత్రలు ఆత్మకథలు అనగానే ఎన్నో ఆరోపణలు మరెన్నో అపవాదులు ఇంకెన్నో అనుమానాలు ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ పేరుతో తెరపైకి వచ్చిన ‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విషయంలోనూ ఇదే జరుగుతోంది. తమ ఆత్మకథను నిజాయితీగా ఆవిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అంటుంటే పబ్లిషింగ్ హౌస్ మాత్రం మొహం చాటేసింది. పెంగ్విన్ సంస్థను ఎన్డీఏ సర్కార్ భయపెడుతోందని పుస్తకాన్ని ప్రచరణ కాకుండా చూస్తోందన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ నేపథ్యంలో అసలు అది ఆత్మకథా..? కల్పిత గాధ ప్రచరణ సంస్థే తేల్చుకుంటుందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదన్నది బీజేపీ నేతల చెబుతున్న మాట.
Also Read : Madan Dilawar: జెన్ జీ ఎఫెక్ట్.. మరో మంత్రి పదవి ఔట్?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం ఇప్పుడు కాంగ్రెస్, బిజెపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ పుస్తకానికి భారత్‌లో తాము ప్రచురణకర్తలం కాదని ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ పెంగ్విన్ రాండమ్ ఆఫ్ హౌస్ ఇండియా క్లారిటీ ఇచ్చేసింది. ఈ పుస్తకాన్ని నవంబర్ 10న విడుదల చేస్తున్నట్లు అమెరికాకు చెందిన పెంగ్విన్ రాండమ్ హౌస్ అనుబంధ విభాగం ఆల్ఫ్రెడ్ ఏ నాఫ్ ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొద్దిరోజుల తర్వాత దీనికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
సోనియా ఆత్మకథ ప్రచరణ విషయంలో పిఆర్‌హెచ్ఐ వెనక్కి తగ్గిందన్న ఊహాగానాలు బయల్దేరాయి. అయితే, పుస్తకంలో ఎడిటోరియల్ మార్పులకు రచయిత్రి ఒప్పుకోకపోవటం వల్లే సోనియా ఆత్మకథను ప్రచురించకూడదని తాము నిర్ణయించుకున్నట్లు వచ్చిన వార్తలు ఏమాత్రం నిజం కాదని ఆ సంస్థ తెలిపింది. పుస్తక ప్రచురణకు తాము ఆసక్తిగానే ఉన్నామంటూనే రచయితలు ఇచ్చే సమాచార వాస్తవ నిర్ధారణ, పుస్తకానికి ఉపయోగపడే సిఫారసులు చేయడం అన్నది ప్రచురణకర్తగా తమ బాధ్యత విధి అని తెలుపుకొచ్చింది.
సోనియా ఆత్మకథ పుస్తకం ప్రచరణ విషయంలో మోడీ ప్రభుత్వం ఒత్తిడికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా లొంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హత్య చేయడమే అంటూ ఎన్డీఏ పై విమర్శలతో మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో భారత భూభాగాలను చైనా ఆక్రమించడం, ఆర్ఎస్ఎస్ సహా పలు అంశాలపై మార్పులు చేయడానికి సోనియా గాంధీ అంగీకరించకపోవడంతోనే పుస్తక ప్రచురనకు పిఆర్‌హెచ్ఐ వెనుకడుగు వేసిందనేది కాంగ్రెస్ ఆరోపణ.
అటు పుస్తకంలోని కంటెంట్ పై బీజేపీ పలు ప్రశ్నలు, అనుమానాలు లేవనెత్తింది. సోనియా గాంధీ రాసిన పుస్తకం ఆత్మకథనా లేక కల్పిత గాధనా అనేది తేలాలని అంటుంది. ఇది రచయిత్రి, ప్రచురణకర్త తేల్చుకోవాల్సిన విషయంగా కమలనాథులు చెబుతున్నారు. ఆత్మకథగా పేర్కొన్న పుస్తకం కల్పిత కథ అయితే, ప్రచురించడానికి ముందు పబ్లిషర్ దానిని తప్పక పరిశీలిస్తారనేది బిజెపి వాదన. ఆత్మకథ పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తుందని ఈ పుస్తకం విడుదల విషయంలో కాంగ్రెస్ నేతలు అల్లుతున్న స్టోరీలు చాలా విడ్డూరంగా ఉన్నాయని బిజెపి కౌంటర్ అటాక్ చేస్తుంది.
భారత్‌లో బిలాంగింగ్ పుస్తక పంపెనీదారు ఎవరనే విషయమై ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఈ బుక్ వెర్షన్ రూ. 2615 ఫ్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్ చూపిస్తోంది. ఈ వెబ్‌సైట్ ప్రకారం.. సోనియా గాంధీ ఆత్మకథ ఈ బుక్‌ను బ్రిటన్‌కు చెందిన హార్ఫర్‌కాలిన్స్ అనుబంధ విభాగం విలియం కాలిన్స్ ప్రచురించింది. మరి వివాదంతో మొదలైన ఈ పుస్తకం ముందుముందు రాజకీయంగా ఎలాంటి రచ్చలు రాజేస్తుందన్న ఉత్కంఠ పొలిటికల్ వర్గాల్లో పెరుగుతోంది.
