BRICS Summit Delhi: భారత్ ఆతిథ్యానికి ప్రపంచ నేతలు ఫిదా.. భారతీయ రుచులతో భారీ విందు.. ఎన్ని స్పెషల్స్ చేయించారో తెలుసా?

18వ బ్రిక్స్ సదస్సు(BRICS Summit Delhi) కోసం భారత్ యొక్క విశిష్ట ఆతిథ్యంతో పాటు దేశీయ రుచులను పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Special culinary arrangements for world leaders at the BRICS summit in Delhi.

  • బ్రిక్స్ నేతలకు నోరూరించే విందు
  • మెనూలో హైదరాబాద్ బిర్యానీ, దోసెలు
  • విదేశీ ప్రతినిధులకు భారత ఆతిథ్యం

BRICS Summit Delhi: భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు(BRICS Summit Delhi)కు విదేశీ ప్రతినిధులు, దేశాధినేతలు భారీగా తరలివస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును పురస్కరించుకుని భారత్ మండపంతో పాటు ఢిల్లీలోని ప్రముఖ స్టార్ హోటళ్లు ప్రపంచ నాయకులకు భారత్ యొక్క విశిష్ట ఆతిథ్యంతో పాటు దేశీయ రుచులను పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన సాంప్రదాయ వంటకాలను విదేశీ అతిథులకు వడ్డించేందుకు లీలా ప్యాలెస్, తాజ్ మహల్, లలిత్ వంటి హోటళ్లు సిద్ధమయ్యాయి.

AP Government: ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏల విడుదలపై ఉత్తర్వులు.. ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

మెనూలో హైదరాబాద్ బిర్యానీ, రాగి దోసె;

ఈ సదస్సులో భారతీయ ప్రాచీన ధాన్యాలైన సిరిధాన్యాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. రాగి దోసె, బజ్రా ఉప్మా, కినోవా ఉప్మా, జొన్నలతో చేసిన వివిధ రకాల పదార్థాలను అతిథులకు అందించనున్నారు. వీటితో పాటు హైదరాబాద్ విశ్వవిఖ్యాత బిర్యానీ, కాశ్మీరీ పులావ్, గుజరాతీ, రాజస్థానీ, దక్షిణాది థాలీలతో పాటు వివిధ ప్రాంతాల విశిష్ట వంటకాలను మెనూలో చేర్చడం విశేషం.

అతిథుల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఏర్పాట్లు:

హోటల్ షెఫ్‌లు తమ తల్లుల వంటకాల స్ఫూర్తితో ప్రత్యేక పదార్థాలను తయారు చేయడమే కాకుండా, ప్రతి దేశాధినేత ఆహార అలవాట్లు, అలర్జీలను పరిగణనలోకి తీసుకుని మెనూను మార్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వంటి ప్రముఖుల బస కోసం ప్రత్యేక భద్రతతో పాటు, భారతీయ జాతీయ పుష్పమైన తామర ఆకృతిలో చేసిన ప్రత్యేక తినుబండారాలు, ఆరోగ్యకరమైన పానీయాలను సిద్ధం చేశారు.