Plane Collision At Delhi: రెండు విమానాలు ఢీ.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం..

ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

  • Updated on- April 16, 2026 / 06:14 PM IST

Plane Collision At Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. రన్ వే పై ఆకాశ విమానాన్ని స్పైస్ జెట్ ఢీకొట్టింది. టేకాఫ్ కు ముందు ఏరో ప్లేన్ వే దగ్గర ఆకాశ విమానం ఉండగా స్పైస్ జెట్ విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ఆకాశ ఎయిర్ లైన్స్ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది.

మధ్యాహ్నం సుమారు 2.15 గంటలకు టెర్మినల్ 1 సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో అకాసా విమానం స్టాండ్ నుండి బయటకు వెళ్తుండగా, స్పైస్‌జెట్ విమానం స్టాండ్‌లోకి వస్తోంది. అకాసా ఎయిర్ విమానం, QP-1406, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. స్పైస్‌జెట్ విమానం, SG-124, లేహ్ నుండి అప్పుడే వచ్చింది.

ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ”ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. మా ప్రయాణీకులను వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తరలించడానికి మా గ్రౌండ్ టీమ్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి” అని ఆకాశ ఎయిర్‌లైన్ తెలియజేసింది.

”గురువారం ఢిల్లీ విమానాశ్రయంలోని టాక్సీవేపై ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి. విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆకాశ ఎయిర్ విమానం టేకాఫ్ కోసం టాక్సీయింగ్ చేస్తుండగా, స్పైస్‌జెట్ పార్కింగ్ స్టాండ్ వైపు టాక్సీయింగ్ చేస్తోంది” అని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Also Read: దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం, మహిళా బిల్లును వ్యతిరేకిస్తే సుదీర్ఘ కాలం శిక్షను అనుభవిస్తారు- ప్రధాని మోదీ