Kalki Bhagavan Passes Away: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'ఏకం' ఆశ్రమ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (Kalki Bhagavan Passes Away)(85) అనారోగ్యంతో కన్నుమూశారు.
- V Santhosh Kumar
- Published on- September 30, 2026 / 06:48 AM IST
spiritual guru kalki bhagavan passes away funeral at ekam temple
Kalki Bhagavan Passes Away: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ‘ఏకం’ ఆశ్రమ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్(Kalki Bhagavan Passes Away) (85) అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లంలోని రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకం ఆలయానికి (గోల్డెన్ సిటీ) తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. భగవాన్ తన సతీమణి అమ్మభగవాన్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా అనేక ధ్యాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ మిలియన్ల సంఖ్యలో భక్తులను సంపాదించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ కీలక సూచనలు
ఎల్‌ఐసీ ఏజెంట్ నుంచి ఆధ్యాత్మిక గురువు వరకు – కల్కి భగవాన్ జీవన ప్రస్థానం:
తొలుత విజయ్‌కుమార్ పేరిట ఎల్‌ఐసీ ఏజెంటుగా, ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1992లో తనను తాను ‘కల్కి అవతారం’గా ప్రకటించుకుని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కుప్పం శాంతిపురంలో మొదటి ఆశ్రమాన్ని స్థాపించి, ఆపై తమిళనాడులోని నేమంలో, వరదయ్యపాళెంలో కల్కి గ్రామీణాభివృద్ధి, వన్నెస్ హ్యూమన్, లోకా ఫౌండేషన్, ముక్తి వంటి ట్రస్టుల ద్వారా విస్తృత ఆధ్యాత్మిక సేవలు అందించారు. విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ధ్యానం, ముక్తి దీక్ష తరగతులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
