బీజేపీ హోలీ వేడుక‌ల్లో కుప్ప‌కూలిన స్టేజీ : నేతలకు గాయాలు

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన హోలీ ఫంక్షన్ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. హోలీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది.

  • Publish Date - March 23, 2019 / 09:02 AM IST

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన హోలీ ఫంక్షన్ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. హోలీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన హోలీ ఫంక్షన్ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. హోలీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నేతలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నేతలంతా హాజరయ్యారు. ఒకేసారి అందరూ స్టేజీపై ఎక్కారు. నేతలు మాట్లాడుతుండగానే.. స్టేజీ కుప్పకూలి కింద పడిపోయారు.
Read Also : చైనాలో టూరిస్టు బస్సులో మంటలు : 26 మంది మృతి

ఈ ఘటనలో పార్టీ కిషాన్ మోర్చా నేత అవ్దేశ్ యాదవ్ సహా పలువురు బీజేపీ నేతలకు గాయాలు అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గాయపడిన నేతలను సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ ఫంక్షన్ స్టేజీ కూలిన ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..