Cm Stalin
Stalin Writes To 37 National Leaders : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ రాజకీయ పార్టీలకు సంబంధించిన 37 మంది నేతలకు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు 36 మంది కీలక నేతలకు ఆయన లేఖలు రాశారు. మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, “ఆల్ ఇండియా సోషల్ జస్టిస్” వేదికలో తమ పార్టీకి సంబంధించి నేతలను చేర్చుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్త్తి చేశారు. జాతీయస్థాయిలో సమాఖ్య విధానం, సామాజిక న్యాయ సూత్రాలను సాధించే దిశగా కృషి చేసేందుకు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కలిసి రావాలని కోరారు.
Read More : ‘Anti-Suicide’ Fan Rod: ‘ఆత్మహత్య నివారణ ఫ్యాన్ కడ్డీ”ల వ్యాపారానికి రూ.50 లక్షలు నిధులు
ఉమ్మడి వేదికగా ఒక ఫెడరేషన్ తప్పనిసరిగా ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సమానమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులు, అవకాశాలకు అర్హులని భావజాలంలో నమ్ముతామన్నారు. సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్న వాళ్లంతా..ఒక్కతాటిపైకి వచ్చి ఏకమైతే ఈ శక్తులని అడ్డుకోగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, మమతా బెనర్జీ, డీ. రాజా, సీతారం ఏచూరి, చంద్రబాబు నాయుడు, అరవింద్ కేజ్రీవాల్, ఉద్దవ్ థాకరే, అఖిలేష్ యాదవ్ లతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ పార్టీలకు నేతలకు కూడా లేఖలు రాశారు.