Chanchalguda jail : ఫీల్ ద జైల్.. ఒక రోజు జైల్లో ఉంటే ఎలా ఉంటుందో ఫీల్ అవుతారా? టికెట్ రేటు జస్ట్..

Chanchalguda jail : జైలులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారు.. వాళ్లకు ఇచ్చే భోజనం ఎలా ఉంటుంది.. జైలులో ఖైదీలు ఏఏ పనులు చేస్తారు..? వంటి తదితర విషయాలను స్వయంగా తిలకించేందుకు జైలులో ఒకరోజు అంటే 24గంటలపాటు ఖైదీగా గడిపేలా రాష్ట్ర జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Chanchalguda jail

  • రాష్ట్ర జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమం
  • ‘ఫీల్ ది జైల్ ’కు జైళ్ల శాఖ శ్రీకారం
  • సామాన్యులు ఒకరోజు జైలు జీవితం గడిపేలా కార్యక్రమం

Chanchalguda jail : జైలు జీవితం గడపాలని ఎవరూ కోరుకోరు. కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుండగా.. కొందరు హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతూ జైలుకెళ్తారు. అయితే, జైలులో పరిస్థితులు ఎలా ఉంటాయి.. అక్కడి భోజనం, ఖైదీలు ఉండే గదులు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. నేరాలు చేసి జైలుకెళ్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో సామాన్యులకుసైతం ప్రత్యక్ష అనుభవం కలిగించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది.

Also Read : GRP police open fire on robbers gang : ఏపీలో కాల్పుల కలకలం.. పోలీసులపై రాళ్ల దాడి.. తెల్లవారు జామున ఘటన.. తప్పిన పెను ప్రమాదం..

జైలులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారు.. వాళ్లకు ఇచ్చే భోజనం ఎలా ఉంటుంది.. జైలులో ఖైదీలు ఏఏ పనులు చేస్తారు..? వంటి తదితర విషయాలను స్వయంగా తిలకించేందుకు జైలులో ఒకరోజు అంటే 24గంటలపాటు ఖైదీగా గడిపేలా రాష్ట్ర జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సామాన్య వ్యక్తి ఒకరోజు మొత్తం ఖైదీగా జైలు జీవితం గడపొచ్చు. ఇందుకోసం ఫీజు రూపేన రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

జైలు నాలుగు గోడల మధ్య ఖైదీల జీవితాన్ని సామాన్యులు స్వయంగా అనుభవించేలా ‘ఫీల్ ది జైల్’కు రాష్ట్ర జైళ్ల శాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు చంచల్‌గూడ సెంట్రల్ జైలు పరిసరాల్లోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆప్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో ఏర్పాటు చేసిన ఫీల్ ది జైల్, మ్యూజియాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అనంతరం సందర్శకులను వన్ డే జైలు అనుభవం కోసం అనుమతిస్తారు.

ఇలా అప్లయ్ చేసుకోండి.. నిబంధనలు ఇవే..
♦ జైలులో ఒకరోజు ఖైదీగా గడపాలనుకునే వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
♦ జైల్ వెబ్‌సైట్ పోర్టల్‌లో అప్లయ్ చేసుకోవాలి.
♦ అప్లికేషన్స్ ఆధారంగా సీరియల్ నెంబర్ ప్రకారం జైలులోకి ఒకరోజు అనుమతిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మ్యాన్యువల్‌ను, పాత జైలు పరిసరాల్లో ఏర్పాటు చేశారు.
♦ రూ.500 లేదంటే రూ.1000 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించనున్నారు.
♦ మొబైల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు.
♦ ఎంట్రీ గేట్ వద్ద బార్ కోడ్ అనంతరం నిజమైన ఖైదీలు ధరించే దుస్తులు ధరించాలి.
♦ బ్యారక్ లోని ఒక గదిలో పడుకోవడానికి చాప, తాగడానికి ఒక గ్లాసు ఇస్తారు.
♦ ఉదయం 5గంటలకు నిద్ర లేచి ఎవరి గదిని వారే శుభ్రం చేసుకోవాలి.
♦ జైలులో నిజమైన ఖైదీలకు అందించిన భోజనమే ఫీల్ ది జైలులో ఉన్నవారికీ అందిస్తారు.
♦ పరిసరాలను శుభ్రం చేసే పనులు అప్పగిస్తారు. ఆ తరువాత సెల్ లో వేసి తాళాలు వేస్తారు.
♦ రిమాండ్ ఖైదీలు, శిక్ష‌పడిన ఖైదీల పరిస్థితి జైలులో ఎలా ఉంటుంది.. వారికి అందించే సౌకర్యాలపై  ఒకరోజు జైలు జీవితం గడిపి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
♦ నిబంధనల ప్రకారం.. జైలులో ఒకరోజు పూర్తిగా ఉండలేక మధ్యలో వెళ్లిపోతామంటే మాత్రం రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.