AK-47తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

  • Publish Date - March 12, 2020 / 07:53 AM IST

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) జవాన్ రామస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటాలి క్యాంప్ లో గురువారం (మార్చి 12,2020) తెల్లవారుఝామున రామస్వామి నత సర్వీస్ AK-47 తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  రామస్వామి రాజస్థాన్ లోని సికార్ జిల్లాకు చెందినవాడని అధికారి తెలిపారు.

పొటాలి క్యాంప్ నుంచి తుపాకి సౌండ్ వినబడటంతో అక్కడే ఉన్న కొంతమంది జవాన్లు పరుగులు పెట్టుకుంటూ వచ్చి చూడగా క్యాంప్ లో రామస్వామి రక్తపుమడుగులు పడి ఉన్నాడు. వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. దీంతో పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

రామస్వామి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రామస్వామి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు. కాగా..ఛత్తీస్ గఢ్ లో మిలటీరీ బలగాల్లో ఇప్పటి వరకూ 50మంది పోలీసు సిబ్బంది ఆత్మమత్య చేసుకున్నట్లుగా గత నెలలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వెల్లడించాయి.

See Also | అందరి దృష్టి మారుతీరావు ఆస్తులపైనే..