Ayodhya Temple : అయోధ్య మందిరానికి స్పెషల్ డిజైన్.. శ్రీరామనవమి రోజున గర్భగుడిలో సూర్యకిరణాలు
ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్‌లో ఉన్న సూర్య దేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ప్రతి శ్రీరామ నవమి రోజున
- venkaiahnaidu
- Updated on- October 18, 2021 / 06:55 AM IST
Ayodhya
Ram Temple ఒడిషా రాష్ట్రంలోని కోణార్క్‌లో ఉన్న సూర్య దేవాలయం స్ఫూర్తితో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ప్రతి శ్రీరామ నవమి రోజున గర్భగుడిలోని రాముని విగ్రహంపై సూర్య కిరణాలు పడి, గర్భగుడి అంతటా ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. శాస్త్రవేత్తలు, జ్యోతిషులు, సాంకేతిక నిపుణులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.
అయోధ్య రామమందిర నిర్మాణంలో సాంకేతిక అంశాలపై పని చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సహా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ముంబైకి చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు కామేశ్వర్ తెలిపారు.
ఇక, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పించనున్నట్లు చెప్పారు.
