Supreme Court : లివిన్ రిలేషన్ షిప్‌లో హింసపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Supreme Court : సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సహజీవనంలో ఉండే మహిళలకుకూడా గృహ హింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం (సెక్షన్ 498A) వర్తిస్తుందని తెలిపింది.
- Harish Thanniru
- Published on- August 3, 2026 / 07:55 PM IST
Supreme Court Key Verdict On Live-In Relationships
Supreme Court : లివిన్ రిలేషన్‌షిప్ ((Live In Relationship) ఉండే మహిళలకూ గృహ హింస చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. భార్యపై భర్త, అతని కుటుంబ సభ్యులు చేసే క్రూరత్వానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498ఏ నిబంధనలు, వివాహానికి సమానమైన లివ్-ఇన్ రిలేషన్ షిప్ సంబంధాలకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం చట్టబద్ధమైన వివాహం జరగలేదనే కారణంతో మహిళలకు ఈ రక్షణ నుండి నిరాకరించడం రాజ్యాంగంలోని సమానత్వ హక్కు (ఆర్టికల్ 14)కు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?
న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. గృహహింస, క్రూరత్వానికి సంబంధించిన ఫిర్యాదు నమోదు చేయడానికి తప్పనిసరిగా చట్టబద్ధమైన వివాహం ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఈ తీర్పు అన్ని లివ్-ఇన్ రిలేషన్ షిప్ సంబంధాలకు వర్తించదని, వివాహ స్వరూపాన్ని పోలి ఉండే సంబంధం అని నిరూపితమైన సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాంటి సంబంధంలో ఇద్దరూ వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో కలిసి జీవించినట్లు తేలాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ కేసులో తనపై నమోదైన 498ఏ కేసును కొట్టివేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు విచారణ కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. సెక్షన్ 498ఏలోని భర్త అనే పదాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవాలని, వివాహ స్వరూపంలోని లివ్-ఇన్ రిలేషన్‌షిప్ సంబంధంలో ఉన్న పురుషుడినీ ఇందులో చేర్చాలని కోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో చట్టాలూ ఆ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, తాజాగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లివ్ ఇన్ రిలేషన్ షిప్ సంబంధాలకు సంబంధించిన చట్టపరమైన రక్షణలను మరింత విస్తరించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
