Supreme Court On UPI: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు!
రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ (Supreme Court On UPI)లావాదేవీలపై ఛార్జీలు విధించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
- V Santhosh Kumar
- Published on- September 28, 2026 / 02:01 PM IST
Supreme court notice to centre rbi npci on upi mdr charges above 2000 rupees
Supreme Court On UPI: రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని నిర్దిష్ట మర్చంట్ డిస్కౌంట్ రేట్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు ఏ చట్టబద్ధ ప్రాతిపదికన ఈ ఛార్జీలు విధిస్తున్నారు? వీటి ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది? వసూలైన డబ్బులు ఎవరెవరికి ఎలా పంపిణీ అవుతాయి? అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను వివరణ కోరింది. న్యాయవాది అంజన్ దత్తా దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ ఛార్జీల అమలపై వెంటనే స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సంబంధిత సంస్థలన్నీ తమ అఫిడవిట్లను దాఖలు చేసిన తర్వాతే సమగ్రంగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
Mancherial Accedent: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆటో ఢీకొని ఇద్దరు కూలీలు మృతి
అక్టోబర్ 15 నుంచి నూతన ఫీజు విధానం – మినహాయింపులు ఇవే:
దాదాపు ఆరేళ్ల పాటు ఉచితంగా సాగిన యూపీఐ(Supreme Court On UPI) సేవల్లో మార్పులు చేస్తూ, అక్టోబర్ 15 నుంచి రూ.2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం రుసుము విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాధారణ వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు, రూ.2,000 కంటే తక్కువ ఉండే చిన్న చిన్న చెల్లింపులకు ఈ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. గరిష్ట ఫీజును రూ.300గా పరిమితం చేయగా, రైల్వేలు, టెలికాం, ఇంధనం, వ్యవసాయం వంటి కీలక రంగాలకు రూ.2,000 దాటినా కేవలం రూ.5 మాత్రమే ఫ్లాట్ ఫీజుగా నిర్ణయించారు.
పారదర్శకత లేదంటూ పిటిషన్ – సుప్రీంకోర్టులో సవాలు:
తగినంత చట్టబద్ధమైన భద్రతలు, పారదర్శకత లేదా ప్రజా సంప్రదింపులు లేకుండానే ఈ రుసుమును ప్రవేశపెట్టారని పిటిషనర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న ఇచ్చిన నోటిఫికేషన్‌ను, సెప్టెంబర్ 15న ప్రకటించిన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను రద్దు చేయాలని లేదా నిలిపివేయాలని కోరారు. పిటిషనర్ వాదనలను విన్న న్యాయస్థానం, ప్రభుత్వ వర్గాల సమాధానాలు పరిశీలించిన పిమ్మటే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
