Rahul (1)
Rahul Gandhi controversial comments : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువునష్టం కేసులో ఎల్లుండి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ ఇదివరకే జూన్24న కోర్టు ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా ఇద్దరు సాక్షుల వాంగ్మూలం కోర్టు తీసుకుంది.
దీంతో మరోసారి రాహుల్‌గాంధీ వాంగ్మూలం ఇచ్చేందుకు 29న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల మధ్య రాహుల్ కోర్టుకు హాజరయ్యే అవకాశముందని ఆయన తరఫు న్యాయవాది కిరీట్ పన్వాలా వెల్లడించారు. 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
Varavararao : వరవరరావుకు బెయిల్ గడువు పొడిగింపు
ఎన్నికల ప్రచారంలో రాహుల్.. మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఈ మోదీలంతా దోపిడీదారులు, వారిదంతా మోదీ సముదాయం అంటూ ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి. దీంతో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ ఆయనపై పరువు నష్టం కేసు చేశారు.
రాహుల్‌గాంధీ యావత్ మోదీ సముదాయాన్నే కించపరిచే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసును సూరత్ కోర్టు విచారిస్తుంది. ఈ కేసు విషయంలో రాహుల్ గాంధీ గతంలో పలుసార్లు కోర్టుకు హాజరయ్యారు. తన వ్యాఖ్యలను తాను నేరంగా భావించడంలేదని రాహుల్ కోర్టుకు తెలిపారు.