క్యాన్సర్ రోగుల కోసం 80మంది అమ్మాయిలు తమ జుట్టును దానం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ఓ ప్రైవేటు కాలేజ్ లో చదువుతున్న 80 మంది ఇంటర్ విద్యార్ధినిలు క్యాన్సర్ రోగుల కోసం జుట్టును దానం చేశారు. ఈ సందర్భంగా వినోదిని అనే విద్యార్ధిని మాట్లాడుతూ..దేశంలో క్యాన్సర్ బారిన పడినవారు ఎంతో బాధపడుతున్నారు. అటువంటివారికి మేము ఆర్థిక సహాయం ఎలాగూ చేయలేము. కానీ మా వంతుగా..క్యాన్సర్ రోగులు చికిత్స చేయించుకునే సమయంలో వారి జుట్టు ఊడిపోతుంది.
అటువంటివారికి మా జుట్టు ఇవ్వాలనుకున్నామని తెలిపారు. మా జుట్టును ఇవ్వాలనుకున్న మేము ముందుగానే మా పేర్లను నమోదు చేసుకున్నామనీ..ఈ క్రమంలో జుట్టును 8 అంగుళాలు మాత్రమే తీయాలనే నిబంధన ఉంది. కానీ నేను అంతకంటే ఎక్కువే ఇవ్వాలనుకున్నానని ఓ విద్యార్దిని తెలిపింది. నాతో పాటు మరో 79మంది జుట్టు ఇవ్వటానికి వచ్చారనీ అందరూ చాలా సంతోషంగా క్యాన్సర్ బాధితుల కోసం జుట్లు ఇస్తున్నారని తెలిపింది. మాలాగనే జుట్టు ఇవ్వాలనుకునే మరో 200లమంది అమ్మాయిలు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారనీ..మరో విడతలో వారు కూడా వచ్చి జుట్టును ఇస్తారని తెలిపింది.
మమ్మారిగా వ్యాపిస్తున్న క్యాన్సర్
క్యాన్సర్ భయంకరమైన మహమ్మారి.. క్యాన్సర్ శరీరంలోని అన్ని భాగాలకు వస్తుంది. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి అటాక్ అవుతోంది క్యాన్సర్. ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్‌ని ముందుగానే రాకుండా నివారించాలి.. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే..ఇక పరిస్థితి నరకప్రాయమే. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి కాబట్టి..ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ భారిన పడకుండా ఉండే అవకాశం ఉందని నిపుణులు పదే పదే చెబుతున్నారు. క్యాన్సర్ సోకిన బాధితులకు వైద్య ఖర్చులు తలకు మించిన భారం అవుతుంది. చికిత్స చేయించుకోవాలంటే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉంటుంది. అందుకు లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చైపోతాయి. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు భరోసా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కీమో థెరపీ చికిత్సలో ఊడిపోయే జుట్టు
క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీ చికిత్స ప్రారంభిచిన కొన్ని రోజుల తరువాత రోగి వెంట్రుకలను కోల్పోవటం ప్రారంభం అవుతుంది. కొంత మందిలో శరీరం పైన ఉండే అనగా కనురెప్పలు, కను బొమ్మలు, కాళ్ళు, చేతి, చంకలో, చాతి పైన ఉండే వెంట్రుకలు కూడా రాలిపోతాయి. అటువంటివారు ఎక్కువగా విగ్గులు ధరిస్తుంటారు. అలా విగ్గులు తయారు చేయటానికి ఈ విద్యార్దినిలు తమ జుట్టుని దానం చేశారు.
See Also | మహిళలు స్నానాలు చేస్తుంటే..రహస్యంగా చిత్రీకరించాడు..తర్వాత