Tamil Nadu Election Results 2026 Live: తమిళనాడులో విజయ్ సునామీ.. ప్రధాని మోదీ రియాక్షన్
Tamil Nadu Election Results 2026 Live : దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా తమిళనాడుపైనే అందరిచూపు కేంద్రీకృతమైంది.
- Harish Thanniru
- Updated on- May 4, 2026 / 06:57 PM IST
Tamil Nadu Elections Results 2026
Tamil Nadu Election Results 2026 Live : ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమైన తర్వాత తొలిసారి కనిపించారు టీఎంకే చీఫ్ విజయ్. చెన్నైలోని తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వచ్చారు.
#WATCH | Tamil Nadu | TVK chief Vijay arrives at his parents’ residence in Chennai pic.twitter.com/Of3def4Bys
— ANI (@ANI) May 4, 2026
తమిళనాడు ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందించారు. ఎన్డీయే కోసం పనిచేసిన అందరికీ థాంక్స్ చెప్పారు.
Gratitude to the voters of Tamil Nadu who supported the NDA in the Tamil Nadu Assembly Elections. We will always remain at the forefront in addressing people’s issues and improving their lives.
Congratulations to TVK on their impressive performance.
The Centre will leave no…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
టీవీకే విజయంతో తమిళనాట వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికిందని ఆ పార్టీ నేత అధవ్ అర్జున్ అన్నారు.
విజయ్ రాజీనామా చేసే స్థానం ఏది? అనే చర్చ జోరందుకుంది. రెండు చోట్ల గెలిచిన విజయ్ ఒక చోట రాజీనామా చేయకతప్పదు. ఆ సీటు ఏది అనేది సస్పెన్స్. మరోవైపు విజయ్ రాజీనామా చేసే సీటులో త్రిష పోటీ చేస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. ఆమె విజయ్ ఇంటికి వెళ్లి కలిశారు. పైగా విజయ్ పార్టీ కోసం త్రిష బ్యాక్ గ్రౌండ్ లో చాలా వర్క్ చేశారనే వాదన ఉంది.
తమిళనాట విజయం చరిత్ర సృష్టించారు. ఓ వైపు పార్టీ ఘన విజయం సాధించగా, మరో వైపు తాను పోటీ చేసిన రెండు చోట్లా ఘనవిజయం సాధించారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ గెలుపొందారు.
టీవీకే పార్టీ ఘనవిజయం సాధించడంతో విజయ్ ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. పార్టీ ఆఫీసుకు మోకాళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు.
తమిళనాట సంచలనం నమోదైంది. సీఎంగా పనిచేసిన స్టాలిన్ ఓడిపోయారు. కళత్తూరు నియోజకవర్గంలో టీవీకే నేత వీఎస్ బాబు చేతిలో ఓటమి చెందారు. మరోవైపు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం చెపాక్ – తిరువెల్లికన్ నియోజకవర్గంలో గెలుపొందారు.
విక్టరీ కొడుతున్న డ్రైవర్ కొడుకు. టీవీకే తరఫున బరిలో దిగిన విజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. విరుగంబాక్కం నియోజకవర్గంలో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మరో వైపు టీవీకే టికెట్ మీద రొయపురం నుంచి పోటీ చేసిన ఆటోడ్రైవర్ విజయ్ కూడా గెలుపొందారు.
An auto driver Vijay Damu wins from #Royapuram. A fan who believed Vijay from the beginning becomes an MLA pic.twitter.com/CrdxwbTg7N
— Rajasekar (@sekartweets) May 4, 2026
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఘనవిజయంపై విజయ్ తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. సింగిల్ గా వచ్చి ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడంపై ఉబ్బి తబ్బిబ్బయ్యారు. విజయ్ తమిళనాడుకు చాలా మంచి చేస్తాడని అభిప్రాయపడ్డారు.
విజయ్ గెలుపుతో నటుడు జీవా సంబరాలు.
Blastu..Blastu..💥 pic.twitter.com/3x9MRSAK57
— Jiiva (@JiivaOfficial) May 4, 2026
టీవీకే అధినేత విజయ్ కి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026
విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం పై సస్పెన్స్. అవసరమైతే ప్లాన్ బి యోచనలో విజయ్. డీఎంకే, అన్నా డీఎంకే, బిజెపి పార్టీలను దూరం పెట్టి… మిగిలిన చిన్న పార్టీలను కలుపుకునే యోచనలో విజయ్. కాంగ్రెస్, పీఎంకే, విసికే, సీపీఎం పార్టీలను కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటు యోచనలో విజయ్.
విజయ్ దళపతి కాదు.. ఇక నుంచి ముదల్ అమైచర్ అంటూ ఆయన అభిమానులు రాష్ట్రం అంతా హడావిడి చేస్తున్నారు. ముదల్ అమైచర్ అంటే ముఖ్యమంత్రి.
గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం. ఎమ్మెల్యేలు జారిపోకుండా రిసార్టులో వారికి ఏర్పాట్లు. మామల్లాపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వసతి. ప్రస్తుతం 107 సీట్లలో ముందంజలో ఉన్న టీవీకే.
‘వాళ్ల అమ్మే వాడికి పెద్ద ఫ్యాన్’. ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజయం తర్వాత ఆయన తండ్రి చంద్రశేఖరన్ కామెంట్స్.
విజయ్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తోంది. దీంతోవిజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, పూర్తి మెజారిటీకి కొంత దూరంలో ఉండడంతో ఆయన సీఎం కావడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
- చిన్న పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. PMK 6, కాంగ్రెస్ 5, CPI 2 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి.
- అన్నాడీఎంకేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అయితే, రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకే మంత్రుల కేటాయింపులో చాలా డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. ఏకంగా సీఎం సీటు షేరింగ్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ కూడా భాగం కాబట్టి విజయ్ అటు వైపు చూడకపోవచ్చని అంచనా
- డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు. ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటు వేశారో అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే విజయ్ మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికల్లో ఓటమిపై సీఎం స్టాలిన్ బావమరిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమికి అధికారులే కారణం అని ఆరోపించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ క్రమంలో విజయ్ ఇంటికి వెళ్లారు త్రిష. ఈ రోజు త్రిష పుట్టిన రోజు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Trisha visits the house of #TVK leader Thalapathy Vijay.pic.twitter.com/LPeqRfHQ6s
— Siddarth Srinivas (@sidhuwrites) May 4, 2026
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై గతంలో ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ సింగల్ గా వచ్చి 118 సీట్లు దక్కించుకుంటారని గతంలో పీకే కామెంట్ చేశారు.
visionary pic.twitter.com/HlHBGftl6y
— Sripaad R (@sripaad125) May 4, 2026
డీఎంకేను భారీ దెబ్బకొట్టిన విజయ్. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో డీఎంకే కూటమి పోగొట్టుకున్న సీట్లు టీవీకే ఖాతాలో పడుతున్నాయి. అన్నాడీఎంకే సీట్లు ఆ పార్టీకే వచ్చాయి. సీఎం సీటుకు కొద్ది దూరంలో ఉన్నారు విజయ్.
తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సహా సుమారు 25 మందికిపైగా మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
తమిళనాడులో విజయ్ పార్టీ దూసుకుపోతుండడంతో ఆ పార్టీ నేతలు, విజయ్ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నైలో విజయ్ ఇంటి వద్ద కోలాహలంగా మారింది.
Un Party ku dhan Enga Vaaku 🔥🔥🫵🏻#TVK #ElectionResults2026 #ThalapathyVijay pic.twitter.com/vQvZLC98Hy
— Prasaanth (@prasaanth_07) May 4, 2026
వెనుకంజలో ఉదయనిధి స్టాలిన్. చెపాక్ – తిరువల్లికేని అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ. అదే సీటు నుంచి పోటీ చేసిన తమిళిసై కూడా వెనుకంజ. టీవీకే డి.సెల్వం అభ్యర్థి ముందంజ.
తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూర్. రెండు సీట్లలోనూ ముందంజలో విజయ్.
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ సెంచరీ కొట్టింది. 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 118 సీట్లు సాధిస్తే టీవీకే పార్టీదే అధికారం. విజయ్ పార్టీ అధికారాన్ని సింగిల్ గా దక్కించుకుంటుందా? లేకపోతే హంగ్ ఏర్పడుతుందా చూడాలి.
తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ రెండో స్థానంలో ఉంది. అధికార డీఎంకే మాత్రం డీలా పడింది. మూడో స్థానంలో ఉంది. ఏకంగా కళత్తూరులో సీఎం స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు.
డీఎంకే వెనుకంజలో ఉండడంతో ఆ పార్టీ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన టెంట్ ను సిబ్బంది తొలగించారు.
తమిళనాట విజయ్ హవా. పెరంబూర్ నుంచి పోటీ చేసిన విజయ్. 6000 ఓట్ల ఆధిక్యం.
తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మూడు పార్టీలు పోటా పోటీగా ఉన్నాయి. కానీ, విజయ్ ఓ మెట్టు పైనే ఉన్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే తమిళనాడు హంగ్ దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ నడుస్తోంది.
DMK vs TVK
తిరుచి ఈస్ట్ లో విజయ్ వెనుకంజలో ఉన్నారు. కానీ, పెరంబూర్ లో ముందంజలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
డిఎంకే 43 స్థానాలు
ఏఐడిఎంకే – 24 స్థానాలు
టీవీకే 16 స్థానాల్లో ముందంజ
బీజేపీ అభ్యర్థి, తెలంగాణకు గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్ వెనుకంజలో ఉన్నారు. ఆమె చెపాక్ – తిరువెల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
తమిళనాడులో పెద్ద నేతలు అందరూ లీడ్ లో ఉన్నారు. కొలత్తూర్ నుంచి సీఎం స్టాలిన్, పెరంబూర్ నుంచి టీవీకే చీఫ్ విజయ్ ముందంజలోఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా లీడ్ లో కొనసాగుతున్నారు.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు మొదలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో డీఎంకే పార్టీ కొంచెం ముందంజలో ఉంది. అన్నాడీఎంకే కూడా వెనుకే వస్తోంది. అయితే, పోస్టల్ బ్యాలెట్ లో విజయ్ పార్టీ టీవీకే పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, పెరంబూర్ లో విజయ్ ముందంజలో ఉన్నారు.
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా తమిళనాడుపైనే అందరిచూపు కేంద్రీకృతమైంది. తమిళనాడులో మొత్తం సీట్లు 234కాగా.. మ్యాజిక్ ఫిగర్ 118. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. డీఎంకేకి అంచనా సీట్లు 100-130 మధ్య ఉండగా.. టీవీకేకు కొన్ని సర్వేలు 40-120 సీట్ల వరకు అవకాశం ఉందని చెప్పాయి. ఇలాంటి అనిశ్చితి హంగ్ అసెంబ్లీకి దారితీయచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో తమిళనాడులో అధికారంలోకి వచ్చేది ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
