Tamil nadu cabinet expansion : తమిళనాడులో విజయ్‌ క్యాబినెట్ విస్తరణ.. 21మది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్.. ఆ పార్టీలకు నో చాన్స్..

Tamil nadu cabinet expansion : తమిళనాడు విజయ్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో 23మంది ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.

Tamil nadu cabinet expansion

Tamil nadu cabinet expansion : తమిళనాడులో టీవీకే విజయ్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో 23మంది ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులచేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Also Read : YS Jagn : ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..

మే10వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తొమ్మిది మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విజయ్ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 32కు చేరింది. మొత్తం 35మంది కేబినెట్‌లో మంత్రులుగా ఉండొచ్చు. ఇంకా మరో ముగ్గురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం జరిగిన మంత్రివర్గం విస్తరణంలో వీసీకే, ఐయూఎంఎల్ భాగస్వామ్యం కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్‌లను సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే నాయకత్వం ఆహ్వానిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో టీవీకే, ఐయూఎంఎల్ పార్టీలకు దక్కే అవకాశం ఉంది.