TVK Vijay TN Elections 2026 : ఓటు వేసేందుకు వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రం వద్ద రచ్చరచ్చ.. తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

TVK Vijay Cast Vote Elections 2026 : టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో స్వల్ప ఉధ్రిక్తత చోటు చేసుకుంది.

Tamil Nadu Elections 2026 TVK chief Vijay vote at polling station in Chennai

  • తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్
  • చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన విజయ్
  • పోలింగ్ కేంద్రం వద్ద విజయ్‌ను చూసేందుకు పోటీపడిన ఓటర్లు

TVK Vijay Tamil Nadu Elections 2026 : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Also Read :  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ శుభవార్త.. జూన్ నెల నుంచి డబ్బులొస్తాయ్..

తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుటుంబ సమేతంగా చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారీస్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్ తో కలిసి ఆల్వార్ పేట పాఠశాలలో క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు. ఇక టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సమయంలో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది.


టీవీకే చీఫ్ విజయ్ ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలాంకారైలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సమయంలో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. విజయ్ పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో అభిమానులు, మీడియా ప్రతినిధులు ఆయన వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆయన్ను ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక షామియానా కూలిపోయింది. షామియానాకు సపోర్టుగా పెట్టిన కర్రలు కుంగిపోయాయి. అయితే, అక్కడున్న వారికి ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


విజయ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తరువాత మీడియా ప్రతినిధులతోపాటు ఆయన అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకొని అందరిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. విజయ్ తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో విజయ్‌ పార్టీ టీవీకే పోటీ చేస్తోంది.