AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ శుభవార్త.. జూన్ నెల నుంచి డబ్బులొస్తాయ్..
AP Govt : ఈ ఏడాది జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. దీంతో ఆరోజు నుంచి వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కూటమి సర్కార్ భావిస్తుంది.
chandrababu naidu
- ఏపీలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు కసరత్తు
- జూన్ నెల కొత్తవారికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం
- ముందుగా వితంతువులకు, దివ్యాంగులకు అవకాశం
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కూటమి సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ఊరట లభించనుంది.
Also Read : IPL 2026 : గెలిచే మ్యాచ్ ఓడాం.. వాళ్లవల్లే ఇదంతా.. నా తప్పు కూడా ఉంది.. రిషబ్ పంత్ కీలక కామెంట్స్..
ఈ ఏడాది జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. దీంతో ఆరోజు నుంచి వితంతు పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.53లక్షల మంది వితంతు పింఛన్లకు అర్హులు ఉంటారని అంచనాలు ఉన్నాయి. వీరందరికీ కొత్తగా పింఛన్లు నెలకు రూ.4వేల చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. తద్వారా నెలకు రూ.61కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
కూటమి సర్కార్ ఇప్పటికే పింఛన్ తీసుకునే భర్త చనిపోతే వారి స్థానంలో భార్యకు స్పౌజ్ కేటగిరిలో పింఛన్ ఇస్తోంది. ఈ ప్రక్రియ ప్రతి నెలా కొనసాగుతోంది. దీంతో భర్త చనిపోతే వెంటనే భార్య పేరుమీద ఆ తరువాత నెల నుంచి రూ.4వేల చొప్పున మంజూరు చేస్తోంది. ఇలా మొత్తం 2.30 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. అయితే, పింఛన్ అందని భర్త చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పింఛను రావడం లేదని, తమకూ పింఛను ఇవ్వాలని వారి నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఉంటుంది. దీంతో వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు.. అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేటగిరిలో ఇప్పటికే లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. వాస్తవానికి 28విభాగాల వారికి ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లు అందిస్తుంది. అన్ని విభాగాలు కలిపి కొత్త పింఛన్ల కోసం దాదాపు 10లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు రూ.400 కోట్లు చొప్పున ప్రతీయేటా రూ.4,899 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రభుత్వానిక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
