TN Governor – TVK Vijay: తమిళనాడు పాలిటిక్స్ లో మరో థ్రిల్లింగ్ ట్విస్ట్.. విజయ్ కి తీవ్ర నిరాశ
దీంతో గవర్నర్ తీరుపై పార్టీలు మండిపడుతున్నాయి. కావాలనే ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి.
- Naveen
- Updated on- May 9, 2026 / 06:24 PM IST
TN Governor – TVK Vijay: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో థ్రిల్లింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ విజయ్ కి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ ను అడిగేందుకు విజయ్ లోక్ భవన్ వరకు వెళ్లారు. అయితే, గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో యూటర్న్ తీసుకుని మళ్లీ ఇంటికి వెళ్లిపోయారు విజయ్. దీంతో గవర్నర్ తీరుపై పార్టీలు మండిపడుతున్నాయి. కావాలనే ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కేరళం గవర్నర్ గానూ వ్యవహరిస్తున్నారు. ముందస్తు అపాయింట్ మెంట్ ఉండటంతో ఆయన కేరళంకు వెళ్లనున్నారు. తిరిగి సోమవారం ఆయన తమిళనాడుకి వచ్చే అవకాశం ఉంది. అదే రోజున విజయ్ గవర్నర్ ని కలుస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు తగిన సంఖ్యా బలం లేదని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న విజయ్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చారు గవర్నర్. అయితే, ఇవాళ వీసీకే, ఐయుఎంల్ పార్టీలు టీవీకేకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో టీవీకే సంఖ్యా బలం 120కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది టీవీకే. ఆ పార్టీలు ఇచ్చిన మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందుకు విజయ్ కు లైన్ క్లియర్ అయ్యింది.
Also Read: ఉత్కంఠకు తెర.. విజయ్‌కు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు
