VCK – TVK Vijay: ఉత్కంఠకు తెర.. విజయ్‌కు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు

TN Politics VCK - TVK Vijay: విజయ్ టీవీకే పార్టీకి వీసీకే మద్దతు తెలిపింది. ఈ మేరకు వీసీకే నేత తిరుమావళవన్ నుంచి లేఖ అందుకున్నారు టీవీకే నేత అదవ అర్జున్.

  • Updated on- May 9, 2026 / 05:28 PM IST

Tamil Nadu Government Formation Vck Gives Letter Of Support To Tvk

VCK – TVK Vijay: ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు వీసీకే పార్టీ తన నిర్ణయం వెలువరించింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. విజయ్ టీవీకే పార్టీకి వీసీకే మద్దతు తెలిపింది. ఈ మేరకు వీసీకే నేత తిరుమావళవన్ నుంచి లేఖ అందుకున్నారు టీవీకే నేత అదవ అర్జున్. వీసీకే పార్టీ మద్దతుతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అయ్యింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతుతో టీవీకే సంఖ్యా బలం 118కి చేరింది. తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118. ఫైనల్ గా ఆ మ్యాజిక్ ఫిగర్ బలం టీవీకేకి దక్కింది.

ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ టీవీకేకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీసీకే సైతం తన సపోర్ట్ ను ఇచ్చింది. దీంతో ఉత్కంఠకు తెర పడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అయ్యింది. వీసీకే మద్దతు ప్రకటించడంతో టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా? అనేదానిపై నిన్నటి వరకు ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈరోజు వీసీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సంపూర్ణ మద్దతును టీవీకే పార్టీకి ఇచ్చింది.

Also Read: విజయ్ రిమోట్ స్టాలిన్ చేతిలో..!

కాసేపట్లో టీవీకే నేత అదవ అర్జున్ గవర్నర్ ను కలుస్తారని సమాచారం. టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో వీసీకే నుంచి లేఖను అందుకున్న అదవ అర్జున్ నేరుగా గవర్నర్ ను కలిసి మద్దతు లేఖను అందజేస్తారని తెలుస్తోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

  • టీవీకే – 107
  • కాంగ్రెస్ – 5
  • సీపీఐ – 2
  • సీపీఎం – 2
  • వీసీకే – 2

Also Read: నెట్టింట వైరల్ అవుతోన్న విజయ్ మార్క్స్ షీట్.. ఆ సబ్జెక్ట్ అంటే దళపతికి కూడా భయమే.. జస్ట్ పాస్..!