Tamil Nadu Government: మేనమామ పథకానికి పచ్చజెండా.. ప్రతి బిడ్డకు 1 గ్రాము ఉంగరం.. బడ్జెట్‌లో రూ.755 కోట్లు కేటాయింపు

తమిళనాడు (Tamil Nadu Government)ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం ఒక అత్యంత ఆకర్షణీయమైన సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

Tamil nadu government launches menamama gold ring scheme for newborns

  • పసిపిల్లలకు బంగారు ఉంగరం కానుక
  • 1.28 లక్షల ఉంగరాల తయారీ
  • సెప్టెంబర్ 15న పథకం ప్రారంభం

Tamil Nadu Government: తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం ఒక అత్యంత ఆకర్షణీయమైన సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ‘మేనమామ బంగారు ఉంగరం’ పేరిట అమలు కానున్న ఈ పథకం కింద నవజాత శిశువులకు ఉచితంగా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందజేయనున్నారు. ఈ ఉంగరంపై ముఖ్యమంత్రి విజయ్ ముఖచిత్రంతో పాటు తమిళనాడు ప్రభుత్వ అధికారిక ముద్రను కూడా ముద్రించనుండటం విశేషం.

TGBCL: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 121 కొత్త ఫారెన్ బ్రాండ్లు.. ఆబ్కారీ భవన్ కీలక ప్రకటన

రూ.755 కోట్లు కేటాయింపు:

ఈ ప్రతిష్టాత్మక పథకం(Tamil Nadu Government) అమల్లో భాగంగా వర్తించే ఖర్చుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.755.83 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. పథకానికి కావలసిన పసిడి ఉంగరాల తయారీకి ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవగా, రూపాయి సర్వీసు ఫీజుతో ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగం గానే మొత్తం పనుల్లో 70 శాతం ప్రముఖ జోయ్ ఆలూక్కాస్ సంస్థకు, మిగిలిన 30 శాతం పనులను కల్యాణ్ జ్యువెలర్స్ సంస్థకు అప్పగించినట్లు సమాచారం.

తొలిదశలో లక్షకు పైగా ఉంగరాలు:

పథకానికి సంబంధించి మొదటి దశలో భాగంగా మొత్తం 1,28,499 బంగారు ఉంగరాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పూర్తిస్థాయి ఒప్పందాలను ముగించాయి. ఈ ప్రత్యేక పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి దివంగత ప్రసిద్ధ నాయకుడు అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబరు 15వ తేదీన ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. గతంలో టీవీకే అధినేతగా ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.