Factories Act Amendment Bill : ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించిన తమిళనాడు ప్రభుత్వం
ఈ కొత్త నిబంధన పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం స్టాలిన్ వెనక్కి తగ్గారు. ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకున్నారు.
- bheemraj
- Published On : May 1, 2023 / 02:42 PM IST
cm stalin
Factories Act Amendment Bill : వివాదాస్పద ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఎంపిక చేసిన ఫ్యాక్టరీల్లో పని వేళలను పెంచుతూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. మే1 కార్మికుల దినోత్సవం(మేడే)సందర్భంగా సీఎం స్టాలిన్ చింతాద్రిపేటలో ఉన్న మే డే పార్క్ స్మారకం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ గురించి ఎమ్మెల్యేలందరికీ చెప్పనున్నట్లు పేర్కొన్నారు. కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి ఫ్యాక్టరీ చట్ట సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డీఎంకేకు చెందిన కార్మిక సంఘాలు కూడా ఆ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాయి. కొత్త చట్టం కార్మికులకు వ్యతిరేకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం
ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు ప్రకారం.. ఒకవేళ కార్మికులు 12 గంటలు పని చేస్తే, అప్పుడు ఆ కార్మికులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసే హక్కు ఉంటుంది. అయితే, ఈ కొత్త నిబంధన పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం స్టాలిన్ వెనక్కి తగ్గారు. ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకున్నారు.
