TVK Vijay Deadline: విజయ్‌కి 3 రోజుల డెడ్‌లైన్.. ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ (5), సీపీఎం (2), సీపీఐ (2), వీసీకే (2), ఐయుఎంఎల్ (2) మొత్తం 5 పార్టీల మద్దతుతో టీవీకేకి పూర్తి స్థాయి మెజారిటీ లభించింది.
- Naveen
- Updated on- May 9, 2026 / 09:09 PM IST
TVK Vijay Deadline: ఎట్టకేలకు అరవ హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. ఫైనల్ గా సీఎం సీటును విజయ్ అధిష్టించనున్నారు. రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడులో టీవీకే సర్కార్ కొలువుదీరనుంది. ఇవాళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలిసిన విజయ్.. 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తనకున్న ఎమ్మెల్యేల సంఖ్య, పార్టీల మద్దతు వివరాలను గవర్నర్ కు సమర్పించారు విజయ్. రేపే ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు గవర్నర్ కూడా ఓకే చెప్పారు. ఈ మేరకు విజయ్ కి అనుమతి పత్రాన్ని అందించారు గవర్నర్. అయితే, రేపు గవర్నర్ రాజేంద్ర కేరళంకు వెళ్లాల్సి ఉంది. దాంతో ఉదయం 10 గంటలకే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరగనుంది.
విజయ్ తో పాటు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇక అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి విజయ్ కి డెడ్ లైన్ విధించారు గవర్నర్. అందుకు 3 రోజుల సమయం ఇచ్చారు గవర్నర్. ఈ నెల 13వ తేదీలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని విజయ్ కి సూచించారు. కాగా కాంగ్రెస్ (5), సీపీఎం (2), సీపీఐ (2), వీసీకే (2), ఐయుఎంఎల్ (2) మొత్తం 5 పార్టీల మద్దతుతో టీవీకేకి పూర్తి స్థాయి మెజారిటీ లభించింది.
Also Read: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..
