Vijay TVK Party : టీవీకే చీఫ్ విజయ్‌కు మరోసారి షాక్.. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వని గవర్నర్.. ఆ వివరాలు ఇవ్వాల్సిందే..

Vijay TVK Party : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

Vijay TVK Party

  • మరోసారి గవర్నర్ తో భేటీ అయిన విజయ్
  • ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరిన విజయ్
  • టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ 

Vijay TVK Party : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ విజయ్‌కు మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం మరోసారి లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ కలిశారు. అయితే, పూర్తిస్థాయిలో సంఖ్యా బలం లేనందున ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇచ్చేది లేదని గవర్నర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ సుప్రీంకోరున్టు ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Also Read : Tamil Nadu Politics : ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.. ఈ భేటీ వారిని కలిపేందుకేనా? విజయ్‌కు షాకిస్తారా?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్ పలువురు ఎమ్మెల్యేలతో కలిశారు. అయితే, స్పష్టమైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేశారు. తాజాగా, గురువారం ఉదయం 11గంటలకు మరోసారి లోక్‌భవన్‌లో గవర్నర్‌తో టీవీకే విజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ గవర్నర్ ను కోరారు.

విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ మరోసారి తిరస్కరించినట్లు తెలుస్తోంది. 118మంది ఎమ్మెల్యేల మద్దతు వివరాలు ముందుగా ఇవ్వాల్సిందేనని గవర్నర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. మెజార్టీ ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేది లేదని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో విజయ్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా టీవీకే అగ్ర స్థానంలో నిలిచిందని, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని విజయ్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు, అయితే, గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. గవర్నర్ తీరు పట్ల విజయ్, టీవీకే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు విజయ్ సిద్ధమైనట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. అయితే, విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఆయన్ను ఒక్క స్థానంనుంచే పరిగణలోకి తీసుకుంటారు. దీంతో టీవీకే పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క. కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకోసం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. వీసీకే, సీపీఐలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరితోపాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇస్తామని తెలిపినట్లు సమాచారం.