Assembly Elections 2026 Polling : తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Assembly Elections 2026: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

Tamilnadu and west bengal assembly Elections Polling

  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
  • ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
  • పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసిన పోలీస్ బలగాలు

Assembly Elections 2026: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కట్టారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Also Read : పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన..! సీఎం రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటన్నింటిలో ఒకే విడతలో (గురువారం) పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది. అయితే, ఈ ఎన్నికల్లో మొత్తం 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 5.73కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2.93కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం 75,064 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.


ఫశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తొలి దశలో 16 జిల్లాల్లో 152 స్థానాలకు ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది. ఎన్నికల బరిలో 1,478 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. పోలింగ్ కేంద్రాల వద్ద  కేంద్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఈ 152 స్థానాల్లో 93 తృణమూల్ గెలుచుకోగా.. 59 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభంకాగా.. ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.