Tamilnadu : తమిళనాడుపై బీజేపీ గురి.. టీవీకే విజయ్‌కు భారీ ఆఫర్? తెరపైకి పవన్ కల్యాణ్ పేరు..!

Tamilnadu : విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ వైపు నుంచి గట్టిగానే ప్రయత్నం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. విజయ్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. తమిళనాడు వ్యాప్తంగా అతనికి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతని ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది.

Tamilnadu

Tamilnadu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో పాగా వేయడం ద్వారా దక్షిణాదిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఆ మేరకు ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడులో అన్నాడీఎంకేతో పాటు కలిసొచ్చే పార్టీలతో అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీవీకే పార్టీని సైతం కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.. ఆ మేరకు విజయ్‌తో రాయబారాలు నడుపుతున్నట్లు తమిళనాట రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది.

Also Read : Gold Price Today : గోల్డ్ కొనేవారికి పండగే.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలు ఇవే..

టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీ పేరుతో తమిళనాడు రాజకీయాల్లోకి సినీనటుడు విజయ్ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. విజయ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీవీకే అభ్యర్థులను పోటీ చేయించాలని విజయ్ భావిస్తున్నారు. అయితే, ఇటీవల చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్‌ను కలుపుకొని పోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయ్ ఎన్డీయేలో చేరేందుకు సమ్మతిస్తే.. డిప్యూటీ సీఎం పదవితోపాటు.. 80 అసెంబ్లీ సీట్లను ఇచ్చేలా ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు విజయ్‌తో చర్చలు జరుపుతున్నట్లు.. ఇదే సమయంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం విజయ్‌తో టచ్‌లో ఉన్నారని తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.

టీవీకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్.. మొదటి నుంచి తమిళనాడు సీఎం కుర్చీనే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని విజయ్ పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఉండదని కూడా గతంలో విజయ్ ప్రకటించాడు. అయితే, ప్రస్తుతం తమిళనాట చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పెద్దల ఆఫర్ ను విజయ్ స్వీకరించే అవకాశాలు లేకపోలేదన్న చర్చకూడా జరుగుతుంది.

విజయ్‌ను ఎన్డీయేలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ వైపు నుంచి గట్టిగానే ప్రయత్నం జరుగుతుందన్న ప్రచారం ఉంది. ఎందుకంటే.. విజయ్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. తమిళనాడు వ్యాప్తంగా అతనికి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతని ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. తమిళనాడులో స్వల్ప తేడాతో అధికారాలు చేతులు మారుతుంటాయి. రెండు శాంత ఒట్లు కూడా తమిళ ఫలితాలను మార్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో విజయ్ భారీ ఎత్తున ఓట్ షేర్ కొల్లగొడతాడనే ఊహాగానాలున్నాయి.

ఈ పరిస్థితుల్లో తమిళనాడులో అధికారంలోకి రావాలంటే విజయ్‌ని కలుపుకోవడమే తమకు బెస్ట్ ఆప్షన్ గా బీజేపీ భావిస్తోంది. మరి ఈ ఆఫర్ ను విజయ్ అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బీజేపీ ఆఫర్ ను విజయ్ ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ అని.. ఒకవేళ ఒప్పుకుంటే తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.