Vijay TVK Tamil Nadu Election Result: తమిళనాడులో విజయ్ హవా.. సీఎం అతనేనా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు..

Vijay TVK Tamil Nadu Election Result 2026 : ఫలితాల ప్రారంభంలో వెనుకబడిన టీవీకే.. ఫలితాల లెక్కింపు జరుగుతున్నాకొద్దీ ఆ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకొస్తున్నారు.

Tamilnadu Election Result 2026

Vijay TVK Tamil Nadu Election 2026 : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే, అందరిచూపు తమిళనాడు వైపే ఉంది. తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని అత్యధిక శాతం సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించాయి. డీఎంకే అభ్యర్థులు 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొన్నాయి. అయితే, కేవలం ఒకటి రెండు సర్వే సంస్థలు మాత్రమే విజయ్ అధికారంలోకి వస్తారని చెప్పుకొచ్చాయి. తాజాగా.. వెల్లడవుతున్న ఫలితాలను బట్టిచూస్తే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ టీవీకే పార్టీ అభ్యర్థులు విజయం వైపు దూసుకెళ్తున్నారు.

ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. ఫలితాల ప్రారంభంలో వెనుకబడిన టీవీకే.. ఫలితాల లెక్కింపు జరుగుతున్నాకొద్దీ భారీగా ఆధిక్యంలోకి దూసుకొస్తోంది. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం టీవీకే అభ్యర్థులు 93 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. డీఎంకే అభ్యర్థులు 49 స్థానాల్లో, ఏడీఎంకే అభ్యర్థులు 69 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ప్రస్తుతం పలితాలను బట్టి చూస్తుంటే తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే తమిళనాడు కాబోయే సీఎం విజయ్ అవుతాడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఫలితాలు వెలువడుతున్నాకొద్దీ టీవీకే మెజార్టీ పెరుగుతుండటంతో విజయ్ సొంతంగా అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలో.. (మొత్తం సీట్లు 234, మ్యాజిక్ ఫిగర్ 118).