CM Revanth Reddy: మోదీ గద్దె దిగు.. లేదా ప్రజలే దింపుతారు.. ఈసీని అడ్డుపెట్టుకుని దొడ్డిదారి పాలనా? రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు.

Telangana CM Revanth Reddy demanded removal of CEC Gyanesh Kumar over deletion of voters controversy.

CM Revanth Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం రక్షించలేవని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల గల్లంతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, విపక్షాల హక్కులను కాలరాస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధాని మోదీ వెంటనే బర్తరఫ్‌ చేయాలని, లేని పక్షంలో ప్రధానే స్వయంగా గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.

APSRTC Special Buses: దసరాకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పండగకు 5,261 ప్రత్యేక బస్సులు.. ప్రయాణికులకు బిగ్ రిలీఫ్!

‘ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో’ ధర్నాలో సీఎం.. 13 కోట్ల ఓట్ల గల్లంతుపై ప్రశ్నలు:

కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో’ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద నిర్వహించిన ప్రదర్శనలో రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 2024 నాటికి ఓటర్ల సంఖ్య పెరగాల్సి ఉండగా ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎలా గల్లంతయ్యాయో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి లాక్కునేందుకు మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కుట్ర పన్నుతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు.

విపక్ష నేతలతో కలిసి రాజ్‌ఘాట్‌కు బస్సు ప్రయాణం:

ఇండియా కూటమి లంచ్ మీటింగ్ ముగిసిన అనంతరం, మార్గమధ్యలో తీవ్ర ట్రాఫిక్ జామ్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌ను వదిలి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో కలిసి ఒకే బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదులు ఇచ్చేందుకు వెళ్తే ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం విమర్శించారు.