Revanth-Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక చర్చలు

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు మరియు సాగునీటి పారకంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth-Devendra Fadnavis) ముంబయిలో కీలక చర్చలు జరిపారు.

Telangana cm revanth reddy meets maharashtra cm devendra fadnavis

Revanth-Devendra Fadnavis: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంలో అడుగు ముందుకు పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth-Devendra Fadnavis) ముంబయిలోని సహ్యాద్రి స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్‌ సంజయ్‌ జాజు సహా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చి కీలక ప్రతిపాదనలు చేసింది.

Vangaveeti Radha: అలాంటి మాటలు నేను మాట్లాడను.. ఆయన అనుభవాన్ని గౌరవిస్తా.. వంగవీటి రాధా సంచలన కామెంట్స్

152 మీటర్ల ఎత్తుతోనే గరిష్ఠ ప్రయోజనం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి సమగ్ర వివరణ:

బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల వద్ద నిలిపితే ఎంత నీటిని తరలించగలము? ఎంత మేర ముంపు ఏర్పడుతుందనే అంశాలను వివరిస్తూనే.. ఎత్తును 152 మీటర్లకు పెంచితే రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను సీఎం రేవంత్ స్పష్టంగా వివరించారు. 152 మీటర్ల నీటిమట్టంతో గ్రావిటీ ద్వారా ఎక్కువ నీటిని తరలించి ఉమ్మడి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు. మహారాష్ట్రలో భూసేకరణ, ముంపు ప్రభావం తీవ్రతరం కాకుండా చూస్తామని హామీ ఇచ్చి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.