ప్రజ్ఞా కూడా ఉగ్రవాది – రాహుల్ ట్వీట్
- madhu
- Published On : November 28, 2019 / 08:06 AM IST
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ కూడా ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా..ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అన్నారని, భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదో దుర్ధినం అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
ఎంపీ ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గురువారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీనిపై లోక్ సభ ఓం బిర్లా రెస్పాండ్ అయ్యారు. గాడ్సే దేశభక్తుడని ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించడం జరిగిందన్నారు. రికార్డులో లేనప్పుడు దానిపై చర్చ అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
మరోవైపు ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆమెపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి ప్రజ్ఞా సింగ్ ను తొలగించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని అటువంటి వ్యాఖ్యల్ని బీజేపీ ఎన్నటీకి సమర్థించదని బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. అన్ని బీజేపీ సమావేశాల నుంచి ఆమెను బహిష్కరించిందని తెలిపారు. పార్లమెంట్ క్రమశిక్షణా సంఘం నుంచి కూడా ఆమెను తొలగిస్తున్నట్లు తెలిపారు.
Read More : బెంగళూరులో రూ. 50 వేల ఉల్లి బస్తాల చోరీ
భారతదేశం రాజ్యాంగాన్ని జరుపుకుంటున్న రోజు..దానిని నాశనం చేయడానికి బీజేపీ బిజీగా ఉందంటూ నవంబర్ 27వ తేదీ బుధవారం ట్వీట్‌లో వెల్లడించారు రాహుల్. రాజ్యాంగం ప్రతి భారతీయుడికి చెందినదని, దాని విలువలను, రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు.
Terrorist Pragya calls terrorist Godse, a patriot.
A sad day, in the history of
India’s Parliament.— Rahul Gandhi (@RahulGandhi) November 28, 2019
