The game of Muslim teasing continues says Mayawati
Mayawati: ఉత్తరప్రదేశ్లోని మదర్సాలపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కన్నేసిందని, సర్వే పేరుతో డొనేషన్తో నడుస్తోన్న ప్రైవేటు మదర్సాలలో జోక్యం పెరుగుతోందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదర్సాలపై యూపీ ప్రభుత్వం సర్వే చేపట్టింది. గుర్తింపు లేని మదర్సాలను రద్దు చేసే దిశగా యోగి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని మదర్సాలకు గ్రాంటు నిలిపివేశారు. ఈ విషయమై శుక్రవారం మాయావతి స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ హయాంలో తాము దోపిడీకి గురవుతున్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని, అల్లర్లకు గురవుతున్నామని ముస్లిం సమాజం నుంచి అనేక ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు బీజేపీ సంకుచిత రాజకీయాలు చేస్తూ వారిని అణచివేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ముస్లింలను వేధించే రాజకీయ క్రీడ అంతరాయం లేకుండా కొనసాగుతోంది. ఇది చాలా విచారకరం, ఖండించదగినది. ఇప్పుడు తాజాగా యూపీలోని మదర్సాలపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. మదర్సా సర్వే పేరుతో కమ్యూనిటీ డొనేషన్తో నడుస్తోన్న మదర్సాలలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు అన్యాయమైనవి’’ అని మాయావతి అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం చాతకాని ప్రభుత్వానికి ఒక కమ్యూనిటీపై కక్షసాధింపు చర్యలు నిరాటకంగా చేస్తోందని మాయావతి మండిపడ్డారు. ముస్లింలను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు ఆపి మదర్సాలను ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మార్చి వాటిని మెరుగుపర్చడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని మాయావతి డిమాండ్ చేశారు.