Khade Hanuman: 170 ఏళ్ల హనుమాన్ ఆలయం.. రోడ్డు కోసం తొలగిద్దామంటే.. మూలవిరాట్టుని అంగుళం కూడా కదల్చలేకపోయారు!

కంఠాల్ చౌరాహా - ఛత్రీ చౌక్ మార్గంలో ఉన్న దాదాపు 170 ఏళ్ల నాటి చారిత్రక 'ఖడే హనుమాన్(Khade Hanuman)' ఆలయ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు.

The Khade Hanuman idol in Ujjain that has become a sensation

  • కదలని ఖడే హనుమాన్ విగ్రహం
  • యంత్రాల విఫలంతో దైవ సంకేతం
  • రంగంలోకి దిగిన పురావస్తు నిపుణులు

Khade Hanuman: మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ ధార్మిక క్షేత్రం ఉజ్జయినిలో 2028లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘సింహస్థ కుంభమేళా’ ఏర్పాట్లలో భాగంగా రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కంఠాల్ చౌరాహా – ఛత్రీ చౌక్ మార్గంలో ఉన్న దాదాపు 170 ఏళ్ల నాటి చారిత్రక ‘ఖడే హనుమాన్(Khade Hanuman)’ ఆలయ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. అయితే, ఆ నిలబడి ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని సమీపంలోని టాంకీ చౌక్ వద్దకు సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీ క్రేన్లు, హైడ్రాలిక్ యంత్రాలను ఉపయోగించి నాలుగు సార్లు ప్రయత్నించినప్పటికీ విగ్రహం అంగుళం కూడా పక్కకు కదల్లేదు.

Jogi Meghana: ఏపీ గవర్నర్‌ను కలిసిన జోగి రమేష్ కోడలు.. గృహహింస కేసుపై సంచలన విజ్ఞప్తి

దైవ మహిమగా భక్తుల నమ్మకం: నెట్టింట వైరలవుతున్న వీడియోలు:

అత్యాధునిక యంత్రాలు కూడా విగ్రహాన్ని కదల్చలేకపోవడంతో స్థానిక భక్తులు, ఆలయ పూజారి మహేష్ బైరాగి దీనిని దైవ సంకేతంగా భావిస్తున్నారు. స్వామివారు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారనడానికి ఇవే సంకేతాలని, సంపూర్ణ భద్రత లేనిదే విగ్రహాన్ని తాకవద్దని కోరుతున్నారు. ఈ ఘటనల మధ్య ఆలయ పరిసరాల్లోకి పెద్ద సంఖ్యలో కోతులు చేరుకోవడం, భక్తులు మహా హారతులు ఇవ్వడంతో ఆ ప్రాంతం భక్తిమయంగా మారింది. సోషల్ మీడియాలో సైతం ఈ వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పురావస్తు నిపుణుల రంగా ప్రవేశం.. మూలాలను స్కాన్ చేసేందుకు సన్నాహాలు:

యంత్రాల ఒత్తిడి వల్ల విగ్రహానికి నష్టం జరిగే ప్రమాదం ఉండటంతో అధికారులు బల్డోజర్లు, క్రేన్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలం నాటిదిగా, కొందరు పరమార వంశ కాలం నాటిదిగా భావిస్తున్న ఈ విగ్రహం భూమిలో ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలుసుకునేందుకు పురావస్తు నిపుణులు రంగంలోకి దిగారు. విగ్రహం పునాది, చుట్టుపక్కల మట్టిని స్కానింగ్ చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోనుండగా, ప్రస్తుతం విగ్రహం దెబ్బతినకుండా తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసి అధికారులు రక్షణ కల్పిస్తున్నారు.