King Cobra: కోబ్రాతో అట్లుంటడి మరి.. కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. అది ఏం చేసిందంటే.. వీడియో వైరల్..
అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడగా.. అతన్ని కాటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Harish Thanniru
- Updated on- October 2, 2022 / 09:10 AM IST
KING Cobra
King Cobra: అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడగా.. అతన్ని కాటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కోబ్రా కాటేసిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గం జిల్లాలోని భద్రావతిలోని బొమ్మనకట్ట గ్రామంలో చోటు చేసుకుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
పాములు పట్టే వ్యక్తి.. బొమ్మనకట్ట గ్రామంలో కింగ్ కోబ్రా ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో దానిని పట్టుకొనేందుకు వెళ్లాడు. చాకచక్యంగా దానిని పట్టుకున్నాడు. దాని తలపై స్పర్శచేస్తూ దానిని ముద్దుపెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన కోబ్రా ఒక్కసారిగా పడగవిప్పి సదరు వ్యక్తి మూతిపై కాటేసింది. కోబ్రా కాటువేయడంతో ఒక్కసారిగా కంగుతిన్న పాములు పట్టే వ్యక్తి దానిని వదిలేయడంతో అది అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోవటం వీడియోలో కనిపించింది.
అయితే, కోబ్రా కాటుకు గురైన వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. పాములు పట్టే వ్యక్తిని కింగ్ కోబ్రా కాటేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. బతికున్నావా? నిజమేనా? అయితే దీన్ని మొదట ప్రయత్నించడానికి అతనిని ప్రేరేపించింది ఏమిటో ఆశ్చర్యంగా ఉంది అంటూ రాశాడు. మరో నెటిజన్.. ఇది ఎప్పటికీ గొప్ప లిప్ లాక్ కిస్ అవుతుందంటూ వ్యగ్యంగా రాశాడు. ఇదిలాఉంటే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా పాములలోకెల్లా పొడవైనది కూడా. ఇది ఆగ్నేయాసియాలోని వర్షారణ్యాలలో కనిపిస్తుంది. ఈ రకం నాగుపాము గరిష్ట పొడవు 5.85 మీటర్లు.
