Telugu » National » Thousands Of New Electric Auto Rickshaw In New Colours
Auto Colours: ఆటోల రంగులే వేరయా.. మగ డ్రైవర్లకో కలర్, మహిళా డ్రైవర్లకు మరొకటి
వందల కొద్దీ ఈ-బస్సులు, వేల కొద్దీ ఈ-ఆటో రిక్షాలు ఇకపై కొత్త రంగుల్లో రోడ్లెక్కనున్నాయి. రాబోయే రెండు నెలల్లో మార్పు జరగనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ మినిష్టర్ కైలాష్ గెహ్లాట్....
Auto Colours: వందల కొద్దీ ఈ-బస్సులు, వేల కొద్దీ ఈ-ఆటో రిక్షాలు ఇకపై కొత్త రంగుల్లో రోడ్లెక్కనున్నాయి. రాబోయే రెండు నెలల్లో మార్పు జరగనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ మినిష్టర్ కైలాష్ గెహ్లాట్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే ఓ 20మందికి అనుమతులు అందాయి. ఈ-ఆటో రిక్షా కోసం అప్లై చేసుకున్న వారిలో 10మంది మహిళలు కూడా ఉన్నారు.
‘ఢిల్లీలో డీజిల్, పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో తిరగడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రెండు నెలల్లో సిటీలో వందలకొద్దీ ఈ-బస్సులు, వేల కొద్దీ ఈ-ఆటోలు బ్లూ, లిలాక్ ఆటోలు రోడ్ల మీద కనిపిస్తాయి’ అని మంత్రి వెల్లడించారు.
వీటిని రంగుల్లో కేటాయించారు. ఊదా రంగులో మహిళలకు, బ్లూ రంగుల్లో మగాళ్లకు అని తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) 300 ఈ-బస్సులు మొదలుపెట్టనుంది. మిగిలినవి రాబోయే నెలల్లో తీసుకురానున్నారు.
రంగుల మార్పుతో వాహనాలకు అనుమతిలివ్వడం అనేది చాలా పెద్ద అడుగు. కాలుష్యం తగ్గించడానికి తీసుకున్న నిర్ణయమిది. ఢిల్లీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో మహిళలు కూడా భాగమవుతున్నారు. గత సోమవారం ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ తీసిన డ్రాలో 20వేల మంది దరఖాస్తుదారులు ఉండగా అందులో 2వేల 855మంది పురుషులు, 743మంది మహిళలు అనుమతుల కోసం అప్లై చేశారు.