CWC : సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ కీలక భేటీ
ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది.
- kunduru Vinod
- Updated on- October 16, 2021 / 11:35 AM IST
Cwc
CWC : ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ తమ భవిష్యత్ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలపై సీడబ్ల్యూసీ ముఖ్యంగా చర్చించనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విషయం కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి : డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారు..సొంతపార్టీ నేతల సంభాషణ వీడియో వైరల్
