Corona Cases : దేశంలో ఏడాదిన్నర కనిష్టానికి కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,579 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
- kunduru Vinod
- Published On : November 23, 2021 / 10:54 AM IST
omicron
Corona Cases : దేశంలో కరోనా కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,579 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదే సమయంలో 236 మంది మరణించినట్లు పేర్కొన్నారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,45,26,480 చేరింది.
చదవండి : AP Corona : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
ఇక ఇప్పటివరకు కరోనాతో 4,66,147 మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584 గా ఉంది. కరోనా రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది. సోమవారం కరోనా నుంచి 12,202 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,39,46,749గా ఉంది.
చదవండి : Corona : 29 మంది విద్యార్థినిలకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు
దేశంలో 311 రోజులుగా కరోనా టీకా ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశంలో 117.63కోట్ల మందికి టీకా అందించారు. సోమవారం ఒక్కరోజే 71,92,154 డోసుల టీకాలు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
