AP Corona : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో

10TV Telugu News

AP Corona : ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో కరోనాతో మరో ఇద్దరు మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే

రాష్ట్ర వ్యాప్తంగా 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,371కి చేరుకుంది. మొత్తం 20,54,737 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,428కి పెరిగింది.

Blood Flow : శనగలు తింటే శరీరంలో రక్తం పెరుగుతుందా…

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే.

×