Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే?…

నోటిలో లవంగాలు, ఏలకులు వేసుకుని నమలడం వల్ల దుర్వాసన తగ్గిపోతుంది. నోటిలోని చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది.

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే?…

Mouth

Bad Breath : నోటి దుర్వాసన అనేది చాలా మందిలో కామన్ గా వచ్చే సమస్య.. ఈ సమస్య కారణంగా నలుగురిలో సరదాగా మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటారు. ఎదుటి వారితో మాట్లాడుతున్న సమయంలో నోటి నుండి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం నోటి శుభ్రత పాటించకపోవటమే.. జిగురు వంటి సూక్ష్మ జీవులు పంటి చిగుళ్ళు, నాలుకలో ఒక లాంటి పొరను ఏర్పరుస్తాయి.

నోటి వచ్చే చెడు వాసనకు సంబంధించి విభిన్నమైన కారణాలు ఉన్నాయి. మనం తినే ఆహారాలు సైతం నోటి నుండి దుర్వాసనను వెదజల్లేలా చేస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, చేపలు వంటి ఆహారాలు తింటే వాసనలు వస్తాయి. అలాగే ఒత్తిడి, ఉపవాసం, వంటి వాటి వల్ల నోటి నుండి చెడు వాసనలు వస్తాయి. ధూమపానం, మద్యం వంటి వాటిని సేవించే వారిలో సైతం ఇలాంటి వాసనలు గమనించవచ్చు. సరిగా శుభ్రపరచకపోవడం, సరైన నోటి పరిశుభ్రతలు పాటించకపోవడం కారణంగా నోటి దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ సైతం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆకలితో ఉన్నప్పుడు నోరు నుంచి కూడా వాసన వస్తుంది. శరీరంలో ఆహారం తగ్గినప్పుడు.. తిన్న ఆహారం కడుపులో నిల్వచేరి సరిగా జీర్ణకానప్పుడు నోటి నుండి వాసన వస్తుంది. నీరు ఎక్కువగా తీసుకోకపోతే నోటి దుర్వాసన తీవ్రమవుతుంది. నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ తగ్గిపోతుంది. ఫలితంగా నోరు చెడు వాసన వెదజల్లుతుంది. బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే తప్పకుండా అనుమానించి వైద్యులను సంప్రదించాలి. మూత్ర పిండాల వ్యాధులు ఉన్న వారికి నోటిలో వాసన వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధులు ఉన్న వారికి రక్త ప్రవాహంలో యూరియా పెరుగుతుంది. తద్వారా నోరు దుర్వాసనగా మారుతుంది.నోటి శుభ్రత పాటించకపోవడం, అలర్జీలు వంటి సమస్యల వల్ల కూడా శ్వాస కంపు కొడుతుంది. టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా మీ నోటి నుంచి భరించలేనంత చెడు వాసన వస్తుంది.

దుర్వాసన పోవాలంటే…

నోటిలో లవంగాలు, ఏలకులు వేసుకుని నమలడం వల్ల దుర్వాసన తగ్గిపోతుంది. నోటిలోని చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది. పెరుగు తినడంతో కూడా నోటిలోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అందుకు కారణం పెరుగులో ఉండే ఉత్తమ యాంటీఆక్సిడెంట్లు. ప్రతిరోజూ ఉప్పు లేకుండా పెరుగు తినడంతో నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఆపిల్ ముక్కను నోటిలో వేసుకుని నమలడంతో సమస్య పరిష్కారం అవుతుంది. నాలుకను తప్పనిసరిగా టంగ్ క్లీనర్ ఉపయోగించి శుభ్రం చేయాలి.

రోజుకు రెండు సార్లు బ్రష్‌తో దంతాలను రుద్ది శుభ్రం చేయాలి. సుగంధ ద్రవ్యాల వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువగా నీళ్లు తాగటంతో నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనేను కొద్దిగా నోటిలో వేసుకుని పుక్కిలిస్తే.. హానికర బ్యాక్టీరియా తొలగిపోతుంది. పళ్ల చిగుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. దంతాలను శుభ్రపరిచేటప్పుడు పళ్ళ సందుల్లో ఉండే పాచి వంటివాటిని పూర్తిగా తొలగించుకోవాలి.భోజనం తర్వాత నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ కలిగి ఉన్న పండ్లను తినడం వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. దంతాలకు మంచిది. కాఫీకి బదులు గ్రీన్ టీ తాగండి. ఎందుకంటే గ్రీన్ టీ శ్వాసను మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది.