Today Gold Rate: కరోనాతో పాటే పెరుగుతున్న గోల్డ్ రేట్లు

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నప్పటికీ.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారంతో ..

Today Gold Rate: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నప్పటికీ.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారంతో పోల్చితే బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం రూ.43వేల 900గా ఉంది. ఒక్కరోజులోనే రూ.300 తగ్గింది.

ఒక్క గ్రాం బంగారం రూ.4వేల 390కి లభిస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.47వేల 890గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.330 తగ్గింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ ధర రూ.4వేల 790గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 74వేలుగా ఉంది. అదే బుధవారంతో పోల్చితే రూ.వెయ్యి 300 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.740గా ఉంది. ఇవాళ రూ.130 తగ్గింది. ఇక గ్రాము మాత్రమే కావాలంటే రూ.74కు దొరుకుతుంది.

హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరులో బంగారం ఒకేలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.44వేల 150, ముంబైలో 44వేల 280, న్యూఢిల్లీ 45వేల 490, కోల్‌కతా 46వేల 230గా ఉంది. 10 గ్రాములు వెండి ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖ, చెన్నైలో రూ.740 పలుకుతోంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, కేరళలో రూ.697గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు